Nagarjuna: మరో కథను ఓకే చేసిన నాగ్.. కానీ డైరెక్టరే లేడట!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల ‘ది ఘోస్ట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో నాగ్ యాక్షన్ డోస్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమా అక్కినేని అభిమానులకైతే బాగానే నచ్చింది. కానీ, నాగ్‌కు వరుసగా ఫెయిల్యూర్ సినిమాలు పడుతుండటంతో, ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్టును ఓకే చేసేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Nagarjuna: మరో కథను ఓకే చేసిన నాగ్.. కానీ డైరెక్టరే లేడట!

Nagarjuna Okays Script Of Prasanna Kumar

Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల ‘ది ఘోస్ట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో నాగ్ యాక్షన్ డోస్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమా అక్కినేని అభిమానులకైతే బాగానే నచ్చింది. కానీ, నాగ్‌కు వరుసగా ఫెయిల్యూర్ సినిమాలు పడుతుండటంతో, ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్టును ఓకే చేసేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Nagarjuna : స్టార్ హీరోల తమ్ముళ్లు అనే ఇమేజ్.. అది వదిలేసి.. నాకు తెలిసి అలాంటి హీరోలు ముగ్గురే ఉన్నారు..

అయితే, ఇప్పటివరకు తన నెక్ట్స్ ప్రాజెక్టును నాగ్ ఓకే చేయకపోవడంతో, ఆయన తనకు ఎలాంటి సినిమా కావాలని చూస్తున్నారో అర్థం కావడం లేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు. కాగా, తాజాగా నాగ్ ఓ ప్రముఖ రైటర్ చెప్పిన స్క్రీప్టుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. నేను లోకల్, ధమాకా వంటి సినిమాలతో పాటు ఇతర చిన్న సినిమాలకు కథలను అందించిన రచయిత ప్రసన్న కుమార్ చెప్పిన ఓ స్క్రిప్టుకు నాగ్ ఇంప్రెస్ అయ్యాడట.

Nagarjuna: గాడ్‌ఫాదర్ డైరెక్టర్‌తో సెంచరీ కొడతానంటోన్న నాగ్..?

కాగా ఈ స్క్రిప్టును ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ స్క్రిప్టు ఎలాంటి కథతో రాబోతుందా, ఈ సినిమాలో నాగ్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా నాగ్ నెక్ట్స్ మూవీ గురించి అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.