Nagarjuna : స్టార్ హీరోల తమ్ముళ్లు అనే ఇమేజ్.. అది వదిలేసి.. నాకు తెలిసి అలాంటి హీరోలు ముగ్గురే ఉన్నారు..

ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ.. ''నాకు, కార్తీకి ఊపిరి సినిమా నుంచి మంచి అనుబంధం ఉంది. మా అన్నపూర్ణ స్టూడియోస్ లో సర్దార్ సినిమా విడుదలవ్వటం చాలా ఆనందంగా ఉంది. కార్తీ అన్నయ్య సూర్య తమిళ్ లో..........

Nagarjuna : స్టార్ హీరోల తమ్ముళ్లు అనే ఇమేజ్.. అది వదిలేసి.. నాకు తెలిసి అలాంటి హీరోలు ముగ్గురే ఉన్నారు..

Nagarjuna Speech at Sardar Pre Release Event

Nagarjuna :  కార్తీ హీరోగా, రాశిఖన్నా, రాజీషా విజయం హీరోయిన్స్ గా, ఒకప్పటి హీరోయిన్ లైలా ముఖ్యపాత్రలో పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మించిన తమిళ చిత్రం ‘సర్దార్‌’. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. దీపావళి కానుకగా ఈ నెల 21న సర్దార్ విడుదల కానుంది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్ పై ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

బుధవారం సాయంత్రం సర్దార్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి నాగార్జున అతిధిగా విచ్చేశారు. ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ.. ”నాకు, కార్తీకి ఊపిరి సినిమా నుంచి మంచి అనుబంధం ఉంది. మా అన్నపూర్ణ స్టూడియోస్ లో సర్దార్ సినిమా విడుదలవ్వటం చాలా ఆనందంగా ఉంది. కార్తీ అన్నయ్య సూర్య తమిళ్ లో సూపర్ స్టార్. అలాంటి స్టార్ హీరో ఇమేజ్ నుంచి బయటకి వచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అన్నది మామూలు విషయం కాదు. నాకు తెలిసిన వాళ్లలో అలాంటి వాళ్ళు ముగ్గురే ఉన్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్. శివరాజ్ కుమార్ తమ్ముడు పునీత్ రాజ్ కుమార్, సూర్య తమ్ముడు కార్తీ. వీళ్లంతా వాళ్ళ అన్నయ్యల స్టార్ డమ్ ని వాడుకోకుండా స్టార్స్ అయ్యారు.”

Manchu Vishnu : దమ్ముంటే వాళ్ళ అడ్రస్ పెట్టమనండి.. ట్రోలర్స్ పై మంచు విష్ణు వ్యాఖ్యలు..

”తమిళ్ లో నేను చూసిన అరుదైన నటుల్లో కార్తీ ఒకరు. రకరకాల పాత్రలు పోషిస్తాడు. తెలుగు కూడా బాగా మాట్లాడతాడు, తెలుగులో పాటలు పాడతాడు. అందుకే తెలుగులో కూడా మంచి పేరు సంపాదించాడు కార్తీ” అని తెలిపారు.