Bimbisara : కళ్యాణ్ రామ్ కత్తి మీద సాము చేస్తున్నాడా..?

కళ్యాణ్ రామ్ కెరీర్‌లో హై బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘బింబిసార’ రెండు భాగాలుగా రానుంది..

Bimbisara : కళ్యాణ్ రామ్ కత్తి మీద సాము చేస్తున్నాడా..?

Bimbisara

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ స్టెప్ తీసుకున్నారు. హోమ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో బావ కె.హరికృష్ణ నిర్మాతగా ‘బింబిసార’ అనే ఓ ప్రెస్టీజియస్ మూవీ చేస్తున్నారు. ఈ టైటిల్‌కి ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ‘బన్నీ’, ‘భగీరథ’ సినిమాలు ప్రొడ్యూస్ చేసిన నిర్మాత మల్లిడి సత్యనారాయణ కొడుకు వశిష్ట్ దర్శకుడిగాపరిచయమవుతున్నాడు..

Balayya : ‘లైగర్’ సెట్‌లో ‘లయన్’..

క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది.. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్‌తో గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మైథాలజీ బ్యాక్ డ్రాప్‌లో, భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ‘బింబిసార’ రెండు భాగాలుగా రూపొందుతుంది.

Nandamuri Kalyan Ram

కళ్యాణ్ రామ్ కెరీర్‌లో హై బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఫస్ట్ పార్ట్‌కే దాదాపు 40 కోట్లు ఖర్చుపెడుతున్నారట. కథ మీద నమ్మకంతోనే ఇంత భారీ స్థాయి బడ్జెట్ పెడుతున్నామని, వశిష్ట్ ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నాడని టాక్. ఫస్ట్ పార్ట్‌ని దీపావళికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.