Nani Sister Deepthi : అక్కని డైరెక్టర్‌ని చేసిన నాని..

నాని తన అక్క దీప్తిని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ.. ‘మీట్ క్యూట్’ అనే ఇంట్రెస్టింగ్ మూవీ మొదలుపెట్టారు..

Nani Sister Deepthi : అక్కని డైరెక్టర్‌ని చేసిన నాని..

Nani Sister Deepthi

Nani Sister Deepthi: మస్క్యులర్ హాట్ లుక్‌లో విజయ్ దేవరకొండ, అక్కని డైరెక్టర్‌ని చేసిన నాని, క్రిష్ టేస్ట్ చూపించిన ‘పీనట్ డైమండ్’ ట్రైలర్, ‘దెయ్యంతో సహజీవనం’ సాంగ్ రిలీజ్, విమెన్ సినీ వర్కర్స్‌కి ‘మనం సైతం’ సాయం.. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్‌తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్‌డేట్స్ బ్రీఫ్‌గా చూద్దాం.

మోస్ట్ డిజైరబుల్ మెన్ విజయ్ దేవరకొండ హాట్ లుక్స్‌తో హీటెక్కిస్తున్నాడు. బాలీవుడ్ ఫోటో గ్రాఫర్ డబూ రత్నానీ ఫోటో షూట్‌లో ఫుల్ మస్క్యులర్ బాడీతో టీజింగ్ లుక్‌తో కొత్తగా కనిపిస్తున్నాడు రౌడీ హీరో.

న్యాచురల్ స్టార్ నాని తన సొంత బ్యానర్ అయిన వాల్ పోస్టర్ ప్రొడక్షన్‌లో 4వ సినిమా స్టార్ట్ చేశారు. తన అక్క దీప్తిని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ.. ‘మీట్ క్యూట్’ అనే ఇంట్రెస్టింగ్ మూవీ మొదలుపెట్టారు నాని.

చదువుకుని గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా చీట్ చేశారు, ఆ అమ్మాయి వాళ్లపై ఎలా రివేంజ్ తీర్చుకుంది అన్న కాన్సెప్ట్‌తో నట్టి క్రాంతి నిర్మిస్తున్న సినిమా ‘దెయ్యంతో సహజీవనం’. దీనికి సంబంధించి పాట రిలీజ్ చేశారు టీమ్.

అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్, చాందిని, లీడ్ రోల్స్‌లో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ నిర్మిస్తున్న సినిమా ‘పీనట్ డైమండ్’. ఫస్ట్ లుక్, టీజర్‌తో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమాకు సంబంధించి ట్రైలర్‌ని డైరెక్టర్ క్రిష్ రిలీజ్ చేశారు.

కరోనా కష్టకాలంలో షూటింగ్స్ లేక ఇబ్బందులు పడుతున్న మహిళా సినీ కార్మికులకు ‘మనం సైతం’ ద్వారా సహాయం చేస్తున్నారు కాదంబరి కిరణ్. తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ ఆఫీస్‌లో వారికి నిత్యావసర వస్తువులు అందించారు.