Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ చూడాలని ఎదురు చూస్తున్నాను.. వైరల్ అవుతున్న నారా లోకేష్ ట్వీట్..

టిడిపి నేత నారా లోకేష్ కూడా భీమ్లా నాయక్ సినిమాని సపోర్ట్ చేస్తూ, ఏపీ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. '' భీమ్లా నాయక్‌ సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. నేను కూడా....

Pawan Kalyan :  ‘భీమ్లా నాయక్’ చూడాలని ఎదురు చూస్తున్నాను.. వైరల్ అవుతున్న నారా లోకేష్ ట్వీట్..

Nara Lokesh

 

Bheemla Nayak :  ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ అవుతుంది. తెలంగాణలో సినీ పరిశ్రమని సపోర్ట్ చేస్తూ ‘భీమ్లా నాయక్’ సినిమాకి అయిదవ షో, బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపుకు పర్మిషన్లు ఇచ్చారు. అటు ఏపీలో మాత్రం పరిస్థితి మారలేదు. ఏపీ ప్రభుత్వం గత కొద్ది కాలంగా సినీ పరిశ్రమ, థియేటర్లపై చూపిస్తున్న వైఖరిని అంతా వ్యతిరేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ ఉండటంతో మరోసారి ఏపీ ప్రభుత్వం థియేటర్లకు హెచ్చరికలు జారీ చేసింది. భీమ్లా నాయక్ సినిమా బెనిఫిట్ షోలు వేసినా, ఎక్స్ట్రా షోలు వేసినా, ప్రభుత్వం చెప్పిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవు అంటూ థియేటర్లకు నోటీసులు జారీ చేశారు.

దీంతో నిన్న రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు నగరాల్లో పవన్ అభిమానులు నిరసనలు తెలుపుతున్నారు. సినిమాల పట్ల, పవన్ పట్ల ప్రభుత్వం తప్పుగా వ్యవహరిస్తోంది అంటూ ఆందోళనలు చేపట్టారు. పవన్ అభిమానులు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ అభిమానులతో పాటు టిడిపి నాయకులు కూడా భీమ్లా నాయక్ కి సపోర్ట్ చేస్తూ, ఏపీ ప్రభుత్వం సినిమాపై చూపిస్తున్న వైఖరిని విమర్శిస్తూ ప్రెస్ మీట్స్ పెట్టారు. జేసీ ప్రభాకర రెడ్డి, వర్ల రామయ్య, బొండా ఉమా, మరి కొంతమంది టిడిపి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మరికొంతమంది సోషల్ మీడియాలోపోస్టులు చేశారు.

Ayyappanum Koshiyum : ఒరిజినల్ వర్షన్ సినిమాలోని క్యారెక్టర్లు ‘భీమ్లా నాయక్’లో ఎవరెవరు చేశారో చూడండి..

ఈ సందర్భంగా చంద్రబాబు తనయుడు, టిడిపి నేత నారా లోకేష్ కూడా భీమ్లా నాయక్ సినిమాని సపోర్ట్ చేస్తూ, ఏపీ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ” భీమ్లా నాయక్‌ సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. నేను కూడా సినిమాని చూడాలని ఎదురు చూస్తున్నాను. వైఎస్ జగన్ ఒక పరిశ్రమ తర్వాత మరో పరిశ్రమను నాశనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ని భిక్షాటన చేసే గిన్నెగా మారుస్తున్నారు. సినీ పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదు. భీమ్లా నాయక్ సినిమా ఇలాంటి కుట్రలను అధిగమించి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Pawan Kalyan : ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ వర్సెస్ ‘భీమ్లా నాయక్’

ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ అభిమానులు, జనసేన నాయకులు కూడా ఈ ట్వీట్ ని షేర్ చేస్తూ ‘భీమ్లా నాయక్’కి సపోర్ట్ చేసినందుకు నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలుపుతున్నారు.