మే 14న ‘నారప్ప’ వస్తున్నాడప్పా..

మే 14న ‘నారప్ప’ వస్తున్నాడప్పా..

Narappa: ‘ఎఫ్‌2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘నారప్ప’.. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Narappa

ప్రియమణి కథానాయిక.. తమిళ్ ‘అసురన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
శుక్రవారం విడుదల తేదీ ఖరారు చేశారు.. వేసవి కానుకగా మే 14న ‘నారప్ప’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కుతున్న ‘నారప్ప’ తో వెంకీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారనే మూవీ టీమ్ కాన్ఫిడెంట్‌గా చెబుతోంది.

Narappa

ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శామ్‌.కె నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌, కథ: వెట్రిమారన్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌, పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం..

Narappa,

Narappa