Gandhi : మహాత్మాగాంధీ దేవుడు..నిత్య పూజలు, ఆ గ్రామం ఎక్కడుంది ?

పదమూడు వందల మంది జనాభా ఉన్న ఈ చిన్న గ్రామం.. జాతిపిత మహాత్మా గాంధీని గౌరవించే విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.

Gandhi : మహాత్మాగాంధీ దేవుడు..నిత్య పూజలు, ఆ గ్రామం ఎక్కడుంది ?

Gandhi

Mahatma Gandhi Statue :మహాత్మాగాంధీని.. ఆ గ్రామస్తులు ఓ దేవునిలా కొలుస్తారు. ఏ చిన్న శుభకార్యం ఉన్నా.. గాంధీకి పూజ చేసిన తరువాతనే పనిని ప్రారంభిస్తారు. వర్షాలు కురవకపోతే ఆయన విగ్రహానికి.. జలాభిషేకం చేస్తారు. ఇలా నిత్యం ఆయన్ను స్మరిస్తూ.. దేవుళ్లతో సమానంగా పూజిస్తున్నారు ఆ గ్రామస్తులు.. ఇంతకీ ఎక్కుడుంది ఆ గ్రామం. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని నర్సింగపూర్. పదమూడు వందల మంది జనాభా ఉన్న ఈ చిన్న గ్రామం.. జాతిపిత మహాత్మా గాంధీని గౌరవించే విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.

Read More : Hyderabad : గంజాయి మత్తులో హైదరాబాద్, ఆపరేషన్ గంజా

నర్సింగపూర్ గ్రామ నడిబొడ్డున 1961 నవంబర్ 1న గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పట్నుంచి మహాత్మను దేవునిలా కొలుస్తూ.. నిత్య పూజలు చేస్తున్నారు గ్రామస్తులు. నాటి నుంచి నేటి వరకు అదే సాంప్రదాయం కొనసాగుతోంది. గాంధీని దేవునితో సమానంగా పూజిస్తూ.. గౌరవిస్తున్నారు. గాంధీజీ జయంతి.. వర్ధంతి రోజుల్లో అంతటా పూజలు చేస్తే.. నర్సింగపూర్‌ అందుకు భిన్నం.

Read More :Pawan Kalyan : మంచు విష్ణు సినిమా బ‌డ్జెట్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా మార్నింగ్ షో క‌లెక్ష‌న్స్ అంత కూడా ఉండదు..

గ్రామంలో ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా.. గాంధీకి పూజలు చేసిన తరవాతే  ప్రారంభిస్తామంటున్నారు నర్సింగపూర్‌ వాసులు. వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు అంతటా జలాభిషేకాలు చేస్తే.. నర్సింగపూర్‌లో మాత్రం వర్షాలు కురవాలని గాంధీకి జలాభిషేకం చేస్తారు. తరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని తాము పాటిస్తున్నామని చెబుతున్నారు గ్రామస్తులు.