Maharashtra: ‘రేపు బ‌ల‌ప‌రీక్ష ఉంది.. బెయిల్ ఇవ్వండి’ అంటూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన మాలిక్, దేశ్‌ముఖ్

న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో జైలులో ఉన్న మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్, హోం శాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ త‌మ‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు.

Maharashtra: ‘రేపు బ‌ల‌ప‌రీక్ష ఉంది.. బెయిల్ ఇవ్వండి’ అంటూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన మాలిక్, దేశ్‌ముఖ్

Namab Malik Anil Deshmukh

Maharashtra: న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో జైలులో ఉన్న మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్, హోం శాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ త‌మ‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. మ‌హారాష్ట్ర అసెంబ్లీలో రేపు జ‌ర‌గ‌నున్న బ‌ల‌ప‌రీక్ష‌కు హాజ‌రుకావాల్సి ఉంద‌ని వారు చెప్పారు. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు బ‌ల‌ప‌రీక్ష జ‌రుగుతుంద‌ని వారు గుర్తు చేశారు. వారి పిటిష‌న్ల‌పై విచార‌ణ‌కు సుప్రీంకోర్టు అంగీక‌రించింది. ఇవాళ సాయంత్రం 5.30 గంట‌ల‌కు వాద‌న‌లు విన‌నుంది.

Maharashtra political crisis : పతనం అంచున ఉద్ధవ్ ప్రభుత్వం..‘మహా’ రాజకీయాల భీష్మాచార్యుడు శరద్ పవార్ తక్షణ కర్తవ్యం ఏంటీ?

కాగా, గ్యాంగ్ స్ట‌ర్ దావూద్ ఇబ్ర‌హీంకు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో న‌వాబ్‌ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 23న అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అలాగే, ఇటువంటి ఆరోప‌ణ‌లే ఎదుర్కొంటూ దేశ్‌ముఖ్ కూడా ప్ర‌స్తుతం జైలులో ఉన్నారు. వీరిద్ద‌రు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు త‌మకు ఒక్క రోజు బెయిల్ ఇవ్వాల‌ని ఇటీవ‌ల‌ కోర్టులో పిటిష‌న్లు వేయ‌గా వాటిని న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది.