Nayanathara : కొత్త బిజినెస్ ప్రారంభించిన నయన్.. ఇక అమ్మాయిలంతా ఇవే ప్రొడక్ట్స్

తాజాగా మరో కొత్త బిజినెస్ ని ప్రారంభించింది నయన్. న‌య‌న‌తార ‘ది లిప్‌బామ్‌ కంపెనీ’ పేరుతో ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్‌ను ప్రారంభించింది. చర్మవ్యాధి నిపుణురాలు రేణిత రాజన్‌తో కలిసి....

Nayanathara : కొత్త బిజినెస్ ప్రారంభించిన నయన్.. ఇక అమ్మాయిలంతా ఇవే ప్రొడక్ట్స్

Nayan

Nayanathara :  సెలబ్రిటీలు బిజినెస్ లు చేయడం కొత్తేమి కాదు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన తర్వాత స్టార్స్ అంతా బిజినెస్ వైపే ఆసక్తి చూపిస్తారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు ఫేమ్ ఉన్నప్పుడే సంపాదించేసి వేరే వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి అనే ప్లాన్ లో ఉన్నారు ఇప్పటి సెలబ్రిటీలు. భవిష్యత్తులో సినిమాలు లేకపోయినా బిజినెస్ మీద అయినా సంపాదించొచ్చు అనే ముందుచూపుతో సెలబ్రిటీలు బిజినెస్ లు మొదలు పెడుతున్నారు. అన్ని పరిశ్రమలలోను చాలా మంది సెలబ్రిటీలకు బిజినెస్ లు ఉన్నాయి. కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ బిజినెస్ లు ఉన్నాయి.

pushpa : ‘పుష్ప’ హిందీ వర్షన్‌లో అల్లు అర్జున్‌కి డబ్బింగ్ చెప్పింది ఇతనే

ఇక మన హీరోయిన్స్ కూడా చాలా మంది బిజినెస్ లు మొదలు పెట్టి సక్సెస్ అవుతున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఇప్పటికే ఒక నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాల్లోనే సంపాదిస్తుంది. తాజాగా మరో కొత్త బిజినెస్ ని ప్రారంభించింది నయన్. న‌య‌న‌తార ‘ది లిప్‌బామ్‌ కంపెనీ’ పేరుతో ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్‌ను ప్రారంభించింది. చర్మవ్యాధి నిపుణురాలు రేణిత రాజన్‌తో కలిసి ఈ బ్రాండ్‌ను లాంచ్‌ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Heroines : ఐటెం సాంగ్స్ చేసిన స్టార్ హీరోయిన్స్

ఈ బిజినెస్ గురించి డాక్టర్ రేణిత మాట్లాడుతూ.. నయన్ తో నాకు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. నయనపై నాకు చాలా నమ్మకముంది. అందుకే ఈ బ్రాండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో భాగమయ్యాను. ‘ది లిప్‌బామ్‌ కంపెనీ’కి సంబంధించి కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్య చర్చలు నడిచాయి. కానీ కరోనా కారణంగా ఈ బిజినెస్ ఆలస్యమైంది. ఫైనల్ గా మా బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించాం అని తెలిపారు.

DVV Danayya : ఏపీ సినిమా టికెట్ రేట్లతో నిర్మాతలకు వర్కవుట్ అవ్వదు : ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత దానయ్య

‘ది లిప్‌బామ్‌ కంపెనీ’ నుంచి దాదాపు 100 రకాల లిప్ బామ్స్, లిప్ స్టిక్స్ మార్కెట్ లోకి తీసుకురాబోతున్నాం అని తెలిపారు. అన్ని రకాల పెదవులకు సూట్ అయ్యే ప్రొడక్ట్స్ ని ఉత్పత్తి చేస్తామని తెలిపింది డాక్టర్ రేణిత. నయన్ ఇలాంటి బ్యూటీ బిజినెస్ లోకి అడుగు పెట్టడంతో నయన్ ఫ్యాన్స్ తో పాటు అమ్మాయిలంతా నయన్ ప్రొడక్ట్స్ కొనడానికి ప్రాధాన్యత ఇస్తారని అనుకుంటున్నారు.