Netflix : స్క్విడ్ గేమ్ రికార్డు

స్వ్కిడ్ గేమ్ వెబ్ సిరీస్ గురించి తెలియని వారుండరు. గత నెల 17వ తేదీన నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది.

Netflix : స్క్విడ్ గేమ్ రికార్డు

Net Flix

Squid Game Web Series : స్వ్కిడ్ గేమ్ వెబ్ సిరీస్ గురించి తెలియని వారుండరు. గత నెల 17వ తేదీన నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో…లేదో…అందర్నీ ఆకట్టుకుంది. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ సిరీస్ గా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ చరిత్రలో రికార్డులు సృష్టించింది. విడుదలైన 28 డేస్ లోనే…ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్ ఫ్లిక్స్ యూజర్లు స్వ్కిడ్ గేమ్ వెబ్ సిరీస్ ను చూడడం విశేషం. కొరియన్ భాషలో దీనిని నిర్మించారు.

Read More : AP : మద్యంబాబులకు షాక్..రెండు రోజులు వైన్స్ షాపులు బంద్!

స్వ్కిడ్ గేమ్ వల్ల నెట్ ఫ్లిక్స్ కు దాదాపు 900 మిలియన్ డాలర్ల లాభం జరిగిందని అంచనా వేస్తున్నారు. స్వ్కిడ్ గేమ్ బాగా ప్రజాదరణ పొందడంతో పరోక్షకంగా సంస్థకు భారీ ప్రయోజనం కలిగిందని తెలుస్తోంది. మొదటి సీజన్ లో మొత్తం 8 గంటల 12 నిమిషాల రన్ టైమ్ ఉంది. మొత్తం 9 ఏపిసోడ్స్ ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ రావడంతో..కొత్తగా నెట్ ఫ్లిక్స్ చందాదారులు వచ్చి చేయడం గమనార్హం. 17వ తేదీ విడుదలైనప్పటి నుంచి కంపెనీలో షేర్ల విలువ దాదాపు 7 శాతం పెరిగిందని, సంస్థ విలువ $278.1 బిలియన్లకు చేరుకుంది. మొదటి నాలుగు వారాల్లో ఆ తర్వాత స్పానిష్ థ్రిల్లర్ సిరీస్ మనీ హైస్ట్ సీజన్ 3, 4 టాప్ 10 లిస్టులో ఉంది.