Gangavva : మై విలేజ్ షో అంటూ గంగవ్వతో ప్రోగ్రాం ప్లాన్ చేసిన నెట్‌ఫ్లిక్స్..

ఏకంగా నెట్ ఫ్లిక్స్ గంగవ్వతో మై విలేజ్ షో అనే ప్రోగ్రాం మొదలు పెట్టింది. ఓటీటీలు ఇటీవల లోకల్ గా కూడా పేరు సంపాదించాలి, ఇక్కడ కూడా చందాదారులని సంపాదించాలని గట్టిగా......

Gangavva : మై విలేజ్ షో అంటూ గంగవ్వతో ప్రోగ్రాం ప్లాన్ చేసిన నెట్‌ఫ్లిక్స్..

Gangavva

Netflix :  మై విలేజ్ షో ఛానల్ ద్వారా ఓ పల్లెటూరు నుంచి యూట్యూబ్ లో వీడియోలు ప్రారంభించిన గంగవ్వ 60 ఏళ్ళ వయసులో తన స్టైల్ లో యాక్టింగ్ చేస్తూ అందర్నీ అలరిస్తూ పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది గంగవ్వ. ఆ తర్వాత సినిమాల్లోనూ ఛాన్సులు వచ్చాయి. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొంది. దీంతో ఈ ఏజ్ లో స్టార్ డం సాధించింది గంగవ్వ.

తాజాగా మరో స్టేజికి ఎదిగింది గంగవ్వ. ఏకంగా నెట్ ఫ్లిక్స్ గంగవ్వతో మై విలేజ్ షో అనే ప్రోగ్రాం మొదలు పెట్టింది. ఓటీటీలు ఇటీవల లోకల్ గా కూడా పేరు సంపాదించాలి, ఇక్కడ కూడా చందాదారులని సంపాదించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ లోకల్ లాంగ్వేజెస్ సిరీస్ లు, సినిమాలు డబ్ చేయడం, నిర్మించడం చేస్తున్నాయి. అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కూడా తెలుగులో మార్కెట్ కోసం ట్రై చేస్తుంది. ఇందులో భాగంగానే ఇక్కడి సినిమాలని ఎక్కువగా కొని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తుంది. అంతే కాక లోకల్ గా కూడా వెబ్ సిరీస్ లు నిర్మిస్తుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ తెలుగు వాళ్ళకి మరింత చేరువవ్వడానికి గంగవ్వతో ఈ సరికొత్త ప్రోగ్రాం మొదలు పెట్టింది.

Bittiri Satti : హీరోలందరికీ అతనే కావాలి.. ఒక్కో ఇంటర్వ్యూకి లక్షల్లో రెమ్యునరేషన్..

గంగవ్వ హోస్ట్ గా మై విలేజ్ షో అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలకు ప్రమోషనల్ ఇంటర్వూస్ చేస్తుంది. ఇటీవలే విరాట పర్వం సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వగా రానా, సాయి పల్లవితో గంగవ్వ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ బాగా వైరల్ కావడంతో ఇకపై రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలకు గంగవ్వ ద్వారా ఇలాగే ప్రమోషన్స్ చేయించాలనుకుంటుంది నెట్ ఫ్లిక్స్. మొత్తానికి గంగవ్వ ఒక చిన్న విలేజ్ నుంచి నెట్ ఫ్లిక్స్ వరకు వెళ్లడంతో అందరూ మరోసారి ఆమెని అభినందిస్తున్నారు.