Go Back Modi: ‘మోదీ గో బ్యాక్’.. రాజస్థాన్ పర్యటన సందర్భంగా విరుచుకుపడుతున్న నెటిజెన్లు

మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ ‘గో బ్యాక్ మోదీ’ అంటూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మోదీ పర్యటించినప్పుడు ఇలాంటివి జరగడం మామూలే అయిందని కానీ, మొదటిసారి ఉత్తర భారతంలోని ఒక రాష్ట్రంలో పర్యటనకు వెళ్లినప్పుడు నెట్టింట ఇలాంటి ట్రెండు రావడం ఇదే మొదటిసారి.

Go Back Modi: ‘మోదీ గో బ్యాక్’.. రాజస్థాన్ పర్యటన సందర్భంగా విరుచుకుపడుతున్న నెటిజెన్లు

Rajasthan: ప్రధానమంత్రి ఈరోజు రాజస్థాన్ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. తమ ప్రభుత్వం వచ్చి తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్రంలో నిర్వహించే ర్యాలీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అదే విధంగా రాష్ట్రానికి తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు సహా వచ్చే ఏడాది జరగబోయే లోక్‭సభ ఎన్నికల దృష్ట్యా మెగా ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ ‘గో బ్యాక్ మోదీ’ అంటూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులే ప్రధానంగా ఉన్నారని వేరే చెప్పనక్కర్లేదు. కానీ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మోదీ పర్యటించినప్పుడు ఇలాంటివి జరగడం మామూలే అయిందని కానీ, మొదటిసారి ఉత్తర భారతంలోని ఒక రాష్ట్రంలో పర్యటనకు వెళ్లినప్పుడు నెట్టింట ఇలాంటి ట్రెండు రావడం ఇదే మొదటిసారి.

రెజ్లర్ల నిరసనను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక దేశంలో జరుగుతున్న మత కలహాలు, పెరుగుతున్న నిరుద్యోగం, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ, పెరిగిన ధరలు వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల్లో ప్రధాని ఇచ్చిన హామీలు, అధికారంలో చేస్తున్న పనులకు పొంతన కుదరడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

మోదీ గో బ్యాక్ అనే హ్యాష్ ట్యాగుపై ట్విట్టర్ ట్రెండింగులో ఉన్న ట్వీట్లలో కొన్ని..