New Model Bikes : ఆగస్టులో రయ్‌రయ్‌మంటూ వస్తున్న బైక్స్ ఇవే!

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుంది. ఈ సందర్బంగా దేశమంతా ఆగస్టులో ఆజాదీ కా అమృత్ వేడుకలకు ముస్తాబవుతోంది. ఇక ఇదే సమయంలో పలు కంపెనీలు కొత్త బైక్ లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 న్యూజెనరేషన్‌ మోడల్‌ని ఆగస్టులో మార్కెట్‌లోకి తెస్తోంది. ఓలా కూడా ఇదే నెలలో కస్టమర్లకు బైక్ లను అందించనుంది. వీటితోపాటు ఈ నెలలో రిలీజ్ అవుతున్న బైకుల గురించి తెలుసుకుందాం.

New Model Bikes : ఆగస్టులో రయ్‌రయ్‌మంటూ వస్తున్న బైక్స్ ఇవే!

New Model Bikes

Updated On : August 7, 2021 / 4:59 PM IST

New Model Bikes : దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుంది. ఈ సందర్బంగా దేశమంతా ఆగస్టులో ఆజాదీ కా అమృత్ వేడుకలకు ముస్తాబవుతోంది. ఇక ఇదే సమయంలో పలు కంపెనీలు కొత్త బైక్ లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 న్యూజెనరేషన్‌ మోడల్‌ని ఆగస్టులో మార్కెట్‌లోకి తెస్తోంది. ఓలా కూడా ఇదే నెలలో కస్టమర్లకు బైక్ లను అందించనుంది. వీటితోపాటు ఈ నెలలో రిలీజ్ అవుతున్న బైకుల గురించి తెలుసుకుందాం.

ఓలా
పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించారు. మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్స్ డిమాండ్ అధికంగా ఉండటంతో బుక్కింగ్స్ ఓపెన్ చేసిన కొద్దీ గంటల్లోనే పూర్తవుతున్నాయి. ఇక ఈ నెలలో ఓలా మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తుంది. తేదీ చెప్పనప్పటికీ ఈ నెలలోనే కస్టమర్లకు బైక్ లను అందించనుందని సమాచారం. ఇక 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వీలే ఈ బైక్ కోసం చాలామంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Ola Electric Ola Scooter Estimated Price, Launch Date 2021, Images, Specs,  Mileage

 

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350

సక్సెస్‌ ఫుల్‌ మోడల్‌ క్లాసిక్‌ 350కి మరిన్ని హంగులు జోడించి న్యూజెనరేషన్‌ మోడల్‌ని ఆగస్టులో మార్కెట్‌లోకి తెస్తోంది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. న్యూ ఇంజన్‌, ఫ్రేమ్, టెక్నాలజీ, అధునాత ఫీచర్లను రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ జోడించింది. సీటు, లైటు, హ్యాండిల్‌ బార్‌, పెయింట్‌ స్కీం, డిస్క్‌ బ్రేకుల్లో మార్పులు చేసింది. ఇక ఇంజన్ కూడా పూర్తిగా మార్చింది. ఇప్పటి వరకు ఉపయోగించిన ఇంజన్ స్థానంలో మెటియోర్‌ 350లో వాడే ఇంజన్‌ను ఆర్‌ఈ తెచ్చింది.

Royal Enfield Classic 350 Price BS6 , Mileage, Images, Colours

 

 

బీఎండబ్ల్యూ సీ 400 జీటీ

బీఎండబ్ల్యూ మోటారడ్‌ నుంచి సరికొత్త సీ 400 జీటీ మ్యాక్సీ స్కూటర్‌ని మార్కెట్‌లో ప్రవేశపెట్టబోతుంది. ఈ ప్రీమియం మోడల్‌ స్కూటర్‌ ధర రూ. 5 లక్షల దగ్గర ఉండవచ్చని అంచనా. భారత విపణిలోని స్కూటర్లన్నింటిలో ఇదే పెద్దది. దీని తర్వాత అపాచీ 310 ఉంది.

 

BMW C 400 GT teased as brand's first maxi-scooter for India: Launch soon! -  The Financial Express..

సింపుల్‌వన్‌
ఎమర్జింగ్‌ మార్కెట్‌గా భావిస్తోన్న ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది సింపుల్‌ వన్‌ స్కూటర్‌. ఆగస్టు 15న ఈ స్కూటర్‌ ఇండియా మార్కెట్‌లోకి రానుంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న టీవీఎస్‌ ఐక్యూబ్‌, అథర్‌లకు పోటీగా ఇది మార్కెట్‌లోకి వస్తోంది.

Simple One electric scooter launching on August 15 - Autocar India

 

 

హోండా హర్నెట్‌ 2.0 బేస్డ్‌ ఏడీవీ

ఈ నెల 19న హార్నెట్‌ 2.0 ఏడీవీ మోడల్‌ ను రిలీజ్ చేయనుంది హోండా. హోండాకి చెందిన రెడ్‌ వింగ్‌ లైన్‌ డీలర్‌షిప్‌ ద్వారా ఇవి మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఈ బైకు ధర రూ.1.20 నుంచి 1.50ల మధ్య ఉండవచ్చు. ఈ బైక్ సింగల్ సిలెండర్ 184 సీసీతో మార్కెట్లోకి వస్తుంది.

 

Honda Hornet 2.0 Price (BS6!), Mileage, Images, Colours, Specs - BikeWale