India vs New Zealand: భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్..

ఈనెలలో న్యూజిలాండ్ టీమిండియాతో టీ20 సిరీస్ ఆడుతుంది. ఇందుకోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఇద్దరు సీనియర్ఆ టగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది.  కేన్ విలియమ్సన్, టీమ్ సౌథీ లేకపోవటంతో జట్టు బాధ్యతలను మిచెల్ సాంట్నర్‌కు అప్పగించారు.

India vs New Zealand: భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్..

India vs new zealand

India vs New Zealand: ఈ నెలలో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇప్పటికే భారత్ లో పర్యటించే న్యూజిలాండ్ వన్డే జట్టును ప్రకటించిన ఆ దేశ క్రికెట్ బోర్డు.. తాజాగా టీ20 జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్ టీ20 జట్టుకు మిచెల్ సాంట్నర్ నాయకత్వం వహిస్తాడు. ఎడమచేతి వాటం స్వింగ్ బౌలర్ బెన్ లిస్టన్ తాజాగా ప్రకటించిన జట్టులో కొత్తగా చోటు దక్కించుకున్నాడు. జనవరి 18న హైదరాబాద్‌లో జరిగే మొదటి వన్డేతో వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 24న చివరి మ్యాచ్ జరుగుతుంది. ఆ తరువాత ఇండియా వర్సెస్ భారత్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది.

జనవరిలో భారత్ ఆడే మ్యాచ్‌లు ఇవే ..

ఈ నెలలో న్యూజిలాండ్ టీమిండియాతో టీ20 సిరీస్ ఆడుతుంది. ఇందుకోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఇద్దరు సీనియర్ఆ టగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది.  కేన్ విలియమ్సన్, టీమ్ సౌథీ లేకపోవటంతో జట్టు బాధ్యతలను మిచెల్ సాంట్నర్‌కు అప్పగించారు. పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో మిచెల్ సాంట్నర్ అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 27 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం లెఫ్టార్మ్ మీడియా ఫేసర్ బెన్ లిస్టర్, హెన్రీ షిప్లీలను జట్టులోకి తీసుకున్నారు. ఆల్ రౌండర్ మైకేల్ రిపన్ కూడా 15మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నాడు.

New Zealand: 2009 జనవరి 1 తర్వాత పుట్టిన వారు సిగరెట్ తాగొద్దు, వారికి సిగరెట్ అమ్మొద్దు.. సంచలన చట్టం చేసిన ప్రభుత్వం

లిస్టన్ ఎంపిక పట్ల జట్టు సెలెక్టర్ గావిన్ లారెన్స్ మాట్లాడుతూ.. లిస్టర్ ఏ – జట్టులో అన్ని ఫార్మాట్లలో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని, అందుకే తొలిసారిగా జట్టులోకి ఎంపికయ్యాడని తెలిపారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ 27న రాంచీలో జరుగుతుంది. రెండో మ్యాచ్ 29న లక్నోలో, మూడో మ్యాచ్ ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో జరుగుతుంది.

న్యూజిలాండ్ టీ20 జట్టు ఇదే..

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డేన్ క్లీవర్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ రిప్లన్, హెన్రీ షిప్లీ, ఇస్ సోధి, బ్లెయిర్ టిక్నర్.