Covid in Delhi : ఢిల్లీలో కొత్తగా 27,521 కోవిడ్ కేసులు నమోదు

ఢిల్లీలో కొత్తగా 27,521 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Covid in Delhi : ఢిల్లీలో కొత్తగా 27,521 కోవిడ్ కేసులు నమోదు

Covid In Delhi

Covid in Delhi : ఢిల్లీలో కోవిడ్ కేసులు నిలకడగా ఉన్నాయని ఆరోగ్యశాఖామంత్రి తెలిపి 24 గంటలు గడవకుండానే కొత్తగా 27,521 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీలో కొత్తగా 27,521 కోవిడ్ కేసులు నమోదుకాగా..కోవిడ్ సోకి 40 మంది మృతి చెందారు.గతేడాది ఏప్రిల్ తరువాత భారీగా కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఢిల్లీలో కరోనా పాజిటివిటి రేటు 26.22 శాతంగా ఉంది. కోవిడ్ కట్టడికి ఢిల్లీ వ్యాప్తంగా 20,878 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.కరోనా కేసులు పెరగడంతో ఢిల్లీలో అమలవుతున్న వారాంతపు కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ సహా పలు ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీ పరిస్థితి ఇలా ఉంటే దేశ వ్యాప్తంగా కొత్తగా కేసులు భారీగా నమోదు అయ్యాయి. రెండు రోజుల క్రితం దేశంలో 1,94,720 కొత్త కేసులు న‌మోదు కాగా..బుధవారం (జనవరి 12,2022) ఒక్కరోజే మ‌రింత‌ భారీగా పెరిగి 2,47,417 కేసులు న‌మోద‌య్యాయి. దీనిని బట్టి చూస్తే మొన్న‌టి మంగళవారంకంటే బుధవారం 27 శాతం కేసులు అధికంగా నమోదు అయ్యాయి. అలాగే కోవిడ్ సోకి 84,825 మంది కోలుకున్నారు.

ఇక ప్ర‌స్తుతం దేశంలో 11,17,531 మంది క‌రోనాకు హోం క్వారంటైన్, ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌ 5,488కు పెరిగింది. నిన్న క‌రోనాతో 380 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 4,85,035కు చేరింది.