Nithya Menen : నిత్యామీనన్ కి ఏమైంది.. ఈవెంట్ లో స్టిక్‌తో నడుస్తున్న నిత్యా..

తాజాగా 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి ఇందులో నటించిన ఆర్టిస్టులంతా విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్ లో నిత్య మీనన్......................

Nithya Menen : నిత్యామీనన్ కి ఏమైంది.. ఈవెంట్ లో స్టిక్‌తో నడుస్తున్న నిత్యా..

Nithya Menen

Nithya Menen :  మలయాళ కుట్టి నిత్యామీనన్ తెలుగులో వరుసగా ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాలో పవన్ సరసన కనిపించి అలరించింది నిత్య. ఇక ఆహ తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంలో జడ్జిగా కూడా వ్యవహరించింది. ఇలా సినిమాలు, షోలు, సిరీస్ లతో బిజీ బిజీగా ఉంది నిత్య మీనన్. తాజాగా నిత్య నటించిన వెబ్ సిరీస్ ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ జులై 8 నుంచి అమెజాన్ లో టెలికాస్ట్ కానుంది.

తాజాగా ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి ఇందులో నటించిన ఆర్టిస్టులంతా విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్ లో నిత్య మీనన్ స్టిక్ పట్టుకొని మరో ఇద్దరి సాయంతో నడిచింది. స్టేజిపైకి అలాగే వచ్చింది. దీంతో నిత్యాకి ఏమైంది అని అంతా కంగారు పడ్డారు. స్టేజి మీదకి వచ్చాక నిత్య మాట్లాడుతూ.. ”ఈ సిరీస్ లో ఇలాంటి క్యారెక్టర్ చేశాను. కానీ ఇప్పుడు నిజంగా జరిగింది. ఇటీవలే ఇంట్లో స్టెప్స్ మీద నుంచి స్లిప్ అయి పడ్డాను. దాంతో ఇలా జరిగింది” అని తెలిపింది.

Ketika Sharma : రంగరంగ వైభవంగా.. కేతిక ఏంటమ్మా ఇంత అందంగా..

నడవలేని పరిస్థితిలో కూడా ఇలా తాను నటించిన సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొనడంతో తన డెడికేషన్ ని మెచ్చుకుంటున్నారు. నిత్య త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.