Nitu Ghanghas: బాక్సింగ్‌లో సత్తా చాటిన నీతూ గంగాస్.. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్
శనివారం సాయంత్రం జరిగిన ఫైనల్ పోరులో 48 కిలోల విభాగంలో నీతూ గోల్డ్ మెడల్ సాధించింది. మంగోలియాకు చెందిన బాక్సర్ లుత్సైఖాన్ అల్టాన్సెట్సెంగ్‌పై 5-0తో విజయం సాధించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఆరో భారత మహిళా బాక్సర్‌గా నిలిచింది.

Nitu Ghanghas: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత క్రీడాకారిణి నీతూ గంగాస్ విజేతగా నిలిచింది. శనివారం సాయంత్రం జరిగిన ఫైనల్ పోరులో 48 కిలోల విభాగంలో నీతూ గోల్డ్ మెడల్ సాధించింది. మంగోలియాకు చెందిన బాక్సర్ లుత్సైఖాన్ అల్టాన్సెట్సెంగ్‌పై 5-0తో విజయం సాధించింది.
ISRO: ఇస్రో రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్.. ఆదివారం ఒకే రోజు 36 ఉపగ్రహాల ప్రయోగం
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఆరో భారత మహిళా బాక్సర్‌గా నిలిచింది. ఈ ఫైనల్‌లో నీతూ అద్భుత ప్రదర్శన చేసింది. ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా వరుస పాయింట్లతో దూసుకెళ్లింది. ఏ దశలోనూ ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకుండా ఆడింది. అంతకుముందు రోజు జరిగిన సెమీ ఫైనల్‌లో నీతూ.. కజకిస్తాన్‌కు చెందిన అలువాపై గెలుపొందింది. నీతూకంటే ముందు మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా కేసీ, నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్స్ సాధించారు.
వీరిలో మేరీ కోమ్ ఆరుసార్లు గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషం. ఈ మ్యాచ్ అనంతరం మరో భారత క్రీడాకారిణి కూడా ఫైనల్ ఫైట్‌లో పాల్గొనబోతుంది. ఇండియాకు చెందిన సవీటి బూర ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ లినాతో పోటీ పడుతోంది. 81 కేజీల విభాగంలో ఈ పోటీ జరుగుతుంది.
???? ? ??? ????? ??
NITU GHANGHAS beat Lutsaikhan Atlantsetseg of Mongolia by 5⃣-0⃣in the FINAL ?#WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC @NituGhanghas333 pic.twitter.com/5kpl6dUFzU
— Doordarshan Sports (@ddsportschannel) March 25, 2023