ISRO: ఇస్రో రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్.. ఆదివారం ఒకే రోజు 36 ఉపగ్రహాల ప్రయోగం

ఆంధ్రప్రదేశ్, శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ‘ఎల్‌వీఎమ్3’ రాకెట్ ప్రయోగించబోతుంది. దీని ద్వారా ఒకేసారి 36 వన్ వెబ్ ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతుంది ఇస్రో. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ రాకెట్ ప్రయోగం జరగబోతుంది.

ISRO: ఇస్రో రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్.. ఆదివారం ఒకే రోజు 36 ఉపగ్రహాల ప్రయోగం

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్, శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ‘ఎల్‌వీఎమ్3’ రాకెట్ ప్రయోగించబోతుంది. దీని ద్వారా ఒకేసారి 36 వన్ వెబ్ ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతుంది ఇస్రో.

Bandi Sanjay: బండి సంజయ్ తనయుడికి ఊరట.. యూనివర్సిటీ సస్పెన్షన్‌పై స్టే.. పరీక్షలకు అనుమతి

ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ రాకెట్ ప్రయోగం జరగబోతుంది. దీనికోసం శనివారం ఉదయం 08.30 గంటల నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రాకెట్, శాటిలైట్లను పూర్తిగా తనిఖీ చేశారు. కావాల్సిన ఇంధనాన్ని నింపారు. కౌంట్ డౌన్ ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ‘ఎల్‌వీఎమ్3’ రాకెట్ 43.5 మీటర్ల ఎత్తు, 643 టన్నుల బరువు కలిగి ఉంది. దీన్ని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తారు. బ్రిటన్‌కు చెందిన 36 జనరేషన్-1 ఉపగ్రహాల్ని దీని ద్వారా అంతరిక్షంలోకి పంపిస్తారు. వీటి మొత్తం బరువు 5,805 కిలోలు. ఈ రాకెట్ మూడు దశల రాకెట్.

KA Paul: రాహుల్ గాంధీపై అనర్హత వేటు సిగ్గు చేటు.. ప్రపంచం నవ్వుతోంది.. బండి సంజయ్‌పై పిటిషన్ వేస్తా

అంటే మొదటి దశలో లిక్విడ్ ఫ్యూయెల్‌తో దీన్ని ప్రయోగిస్తారు. తర్వాత సాలిడ్ ఫ్యూయెల్‌తో పని చేసే మోటార్ల ద్వారా ఇది ప్రయాణిస్తుంది. తర్వాత క్రయోజెనిక్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ప్రయోగానికి ఇస్రో.. ఎల్‌వీఎమ్3-ఎం3/వన్‌వెబ్ ఇండియా-2 మిషన్ అనే పేర్లు పెట్టింది. రాకెట్ ప్రయోగించిన 19 నిమిషాలకే ఇది ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దశలవారీగా ఇది జరుగుతుంది. వన్ వెబ్ శాటిలైట్లను భారత టెలికాం సంస్థ అయిన భారతి గ్రూప్ డెవలప్ చేసింది. ఇవి రెండో దశ ఉపగ్రహాలు. కాగా, మొదటి దశ ఉపగ్రహాల్ని గత ఏడాది అక్టోబర్ 23న ప్రయోగించారు.

వన్ వెబ్‌కు సంబంధించి మొత్తం 72 ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో భారతి ఎయిర్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ మొత్తం రూ.1,000 కోట్లు. మొదటి దశలో ఇప్పటికే 36 ఉపగ్రహాలు ప్రవేశపెట్టగా, ఆదివారం మరో 36 ఉపగ్రహాల ప్రయోగం జరగబోతుంది.