KA Paul: రాహుల్ గాంధీపై అనర్హత వేటు సిగ్గు చేటు.. ప్రపంచం నవ్వుతోంది.. బండి సంజయ్‌పై పిటిషన్ వేస్తా

ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి రోజు. భారత ప్రజాస్వామ్యాన్ని చూసి ప్రపంచం నవ్వుతోంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సిగ్గుచేటు. పుచ్చకాయల దొంగ ఎవరూ అంటే మోదీ భుజాలు తడుముకున్నట్లు ఉంది. ఇలాగే ఉంటే భారత సమాఖ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అంతమవుతుంది.

KA Paul: రాహుల్ గాంధీపై అనర్హత వేటు సిగ్గు చేటు.. ప్రపంచం నవ్వుతోంది.. బండి సంజయ్‌పై పిటిషన్ వేస్తా

KA Paul: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పార్లమెంట్ అనర్హుడిగా ప్రకటించడాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ఖండించారు. ఈ నిర్ణయం తీసుకున్న రోజు ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అన్నారు. కేఏ పాల్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ తీరును తప్పుబట్టారు.

Covid-19: మళ్లీ పెరుగుతున్న కోవిడ్.. దేశంలో 1500 దాటిన కేసులు.. ఐదు నెలల తర్వాత ఇదే మొదటిసారి

‘‘ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి రోజు. భారత ప్రజాస్వామ్యాన్ని చూసి ప్రపంచం నవ్వుతోంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సిగ్గుచేటు. పుచ్చకాయల దొంగ ఎవరూ అంటే ప్రధాని మోదీ భుజాలు తడుముకున్నట్లు ఉంది. ఇలాగే ఉంటే భారత సమాఖ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అంతమవుతుంది. బీజేపీ ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదా? బండి సంజయ్ వాగినట్లు దేశంలో ఎవరైనా మాట్లాడుతారా? శివలింగాలు వస్తే మావి.. శవాలు వస్తే మీవి అన్నాడు. బండి సంజయ్‌పై నేను పిటిషన్ వేస్తా.

భారత ప్రజాస్వామ్య వ్యవసస్థను కాపాడుకునేందుకు సిజేఐకి లేఖ రాస్తా. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తున్నవారిపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారు? ఎమ్మెల్యేలు పశువులా.. మనుషులా! కుటుంబ అవినీతి పాలన దేశానికి వద్దు’’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.