కెరీర్‌లో అశ్విన్ చేసినంతగా ఏ స్పిన్నర్ ఇబ్బందిపెట్టలేదు: స్టీవ్ స్మిత్

కెరీర్‌లో అశ్విన్ చేసినంతగా ఏ స్పిన్నర్ ఇబ్బందిపెట్టలేదు: స్టీవ్ స్మిత్

ప్రజెంట్ జనరేషన్‌లో టాప్ క్రికెటర్లలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్మీవ్ స్మిత్ ఒకరు. ప్రత్యర్థి జట్టు ధాటిని తట్టుకుంటూ నిలకడగా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. స్మిత్‌కు రీసెంట్‌గా ఐసీసీ కూడా అరుదైన గౌరవం ఇచ్చింది. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ పంపి గౌరవించింది. కానీ, టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అనుకున్నట్లుగా ఫలితం రాకపోగా నిరాశ తప్పడం లేదు.

స్మిత్‌కు అశ్విన్ వేసిన బౌలింగ్‌తో 4ఇన్నింగ్స్‌లో కేవలం 10పరుగులు మాత్రమే చేసి రెండు సార్లు అవుట్ అయ్యాడు. అటువంటి స్టార్ బ్యాట్స్‌మన్ ఇన్నింగ్స్ మిస్ అవుతున్న ఆస్ట్రేలియాకు మూడో టెస్టులో తిరిగి ఫామ్ లోకి రావాలని కోరుకుంటుంది. మెల్‌బౌర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా 8వికెట్ల తేడాతో ఓడిపోయిన ఆసీస్ 1-1తో సమంగా కొనసాగుతుంది.

రెండు సార్లు రవిచంద్రన్ అశ్విన్ చేతిలో అవుట్ అవడంపై స్మిత్ మాట్లాడుతూ.. ‘అశ్విన్ బౌలింగ్‌లో నేను అనుకున్న రేంజ్‌లో ఆడలేకపోయాను. రివర్స్ లో ఒత్తిడికి గురి చేద్దామని అనుకున్నా. నా కెరీర్ లో మరే స్పిన్నర్ నన్ను అంతగా ఇబ్బంది పెట్టలేదు. ఇంకొంచెం అగ్రెసివ్ గా ఆడి పరిస్థితులు మార్చాలనుకుంటున్నా’ అని స్మిత్ అన్నాడు.

‘ఇది రెండు వైపులా పదునున్న కత్తి. కానీ, దీనిని ఎదుర్కోవాలంటే నా ఆట మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అదే సమయంలో మిడిల్ లో ఆడేందుకు సమయం కోసం చూస్తున్నా. అది నాకు చాలా ముఖ్యం. ఈ ఏడాది వరకూ చూస్తే నేను మిడిల్ లో ఆడి ఎదుర్కొంది కేవలం 64బంతులు మాత్రమే’ అని స్మిత్ చెప్పాడు.

దాంతో పాటు అశ్విన్.. స్మిత్ వికెట్ తీయడం ఎంత ముఖ్యమో చెప్పాడు. ‘అతణ్ని తప్పించడానికి తాము వేసుకున్న ప్లాన్స్ గురించి చెప్పాడు. ఆ ప్లాన్లను అమలుపరిచినందుకు అశ్విన్ హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాను దెబ్బ తీయాలంటే స్మీవెన్ స్మిత్ ను అవుట్ చేయాలి. లేదంటే టాస్క్ కొండెక్కినట్లుగా ఉండేది. బ్యాటింగ్ లైనప్ అంతే స్ట్రాంగ్ గా కొనసాగేది’ అని అశ్విన్ అంటున్నాడు.