Covid Vaccination : మీరు ప్రభుత్వ ఉద్యోగులా..వ్యాక్సిన్ తీసుకోలేదా, జీతం రాదు

ప్రభుత్వానికి చెందిన IHRS పోర్టల్ లో సర్టిఫికేట్లు అప్ లోడ్ చేయాలని సూచించింది. వ్యాక్సినేషన్ తీసుకోని వారికి వేతనాలు నిలుపుదల చేయాలని డిసైడ్ అయ్యింది.

Covid Vaccination : మీరు ప్రభుత్వ ఉద్యోగులా..వ్యాక్సిన్ తీసుకోలేదా, జీతం రాదు

Punjab Corona

No vaccination Certificate No Salary : కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వ్యాక్సిన్ తీసుకోని వారి పట్ల కొంచెం కఠినంగా ఉండాలని అనుకుంటున్నాయి. వ్యాక్సిన్ తీసుకోవాలని పదే పదే కోరుతున్నా..కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలు పలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా పంజాబ్ గవర్నర్ మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు..వ్యాక్సినేషన్ కు లింక్ పెట్టింది. వ్యాక్సినేషన్ తీసుకోని వారికి వేతనాలు నిలుపుదల చేయాలని డిసైడ్ అయ్యింది. ఒక డోస్, రెండు డోస్ లు తీసుకున్న వారికి మాత్రమే జీతాలు అందనున్నాయి.

Read More : Maharashtra : పాత సామాన్లతో ఫోర్ వీలర్..సామాన్యుడిని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్ర

దీని కోసం ఉద్యోగులు తమ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని, సర్టిఫికేట్లు సమర్పించని ఉద్యోగులకు వేతనాలు చెల్లించమని వెల్లడించింది. పంజాబ్ ప్రభుత్వానికి చెందిన IHRS పోర్టల్ లో సర్టిఫికేట్లు అప్ లోడ్ చేయాలని సూచించింది. ప్రస్తుతం కరోనా వైరస్ తో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అత్యంత వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది.

Read More : Apple’s iPhone: ఆపిల్ మరో ముందడుగు.. ఐఫోన్‌లో 48MP కెమెరా!

ఈ క్రమంలో…ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ఇప్పించేందుకు అక్కడి ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటి వరకు 210 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో..రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తోంది. అవసరమైతే రాత్రి వేళ కర్ఫూలు విధించాలని సూచిస్తోంది. రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి.