Nokia G22 Launch : నోకియా నుంచి మూడు సరికొత్త ఫోన్లు.. G22 ఫోన్ మీకు మీరే రిపేర్ చేసుకోవచ్చు, 3 రోజులు బ్యాటరీ లైఫ్ కూడా..!

Nokia G22 Launch : ప్రముఖ HMD గ్లోబల్ కంపెనీ నోకియా (Nokia) నుంచి మూడు సరికొత్త ఫోన్లు వచ్చేశాయి. ఈ నెలలో ఫ్లాగ్‌షిప్ నోకియా X30 5Gని లాంచ్ చేసిన తర్వాత HMD గ్లోబల్ ఇప్పుడు మూడు బడ్జెట్, మిడ్-రేంజ్ ఫోన్‌లను రిలీజ్ చేసింది.

Nokia G22 Launch : నోకియా నుంచి మూడు సరికొత్త ఫోన్లు.. G22 ఫోన్ మీకు మీరే రిపేర్ చేసుకోవచ్చు, 3 రోజులు బ్యాటరీ లైఫ్ కూడా..!

Nokia G22, C32 and C22 launched with up to three days of battery life

Nokia G22 Launch : ప్రముఖ HMD గ్లోబల్ కంపెనీ నోకియా (Nokia) నుంచి మూడు సరికొత్త ఫోన్లు వచ్చేశాయి. ఈ నెలలో ఫ్లాగ్‌షిప్ నోకియా X30 5Gని లాంచ్ చేసిన తర్వాత HMD గ్లోబల్ ఇప్పుడు మూడు బడ్జెట్, మిడ్-రేంజ్ ఫోన్‌లను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 3 రోజుల భారీ బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. నోకియా స్మార్ట్‌ఫోన్‌లు C-సిరీస్‌లో మెరుగైన ఇమేజింగ్, మన్నికతో వస్తాయని పేర్కొంది. నోకియా మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ Nokia G22ని కూడా ఆవిష్కరించింది.

iFixitతో ప్రపంచ సహకారంతో కోర్ రిపేరబిలిటీతో వస్తుంది. HMD గ్లోబల్‌కు చెందిన ప్రోడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆడమ్ ఫెర్గూసన్ నోకియా ఫోన్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఎక్కువ కాలం మన్నికగా నాణ్యమైన డివైజ్‌లకు వాల్యూ ఇస్తారు. ఇస్తారు ధరపై ఎంతమాత్రం రాజీ పడాల్సిన అవసరం లేదు. ఈ కొత్త Nokia G22 రిపేరబుల్ చేయగల డిజైన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమకు తామే సొంతంగా రిపేర్ చేసుకోగలరు. Nokia C32లో అధునాతన ఇమేజింగ్, Nokia C22లో మెరుగైన మన్నికతో C-సిరీస్‌కు మరింత వాల్యూను అందిస్తాయి.

నోకియా G22 రిపేరబుల్ స్మార్ట్‌ఫోన్ :
నోకియా G22 ఫస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. రిపేర్ సులభతరం చేసేందుకు నోకియా గ్లోబల్ రిపేర్ కమ్యూనిటీ iFixitతో కలిసి పనిచేసింది. నోకియా G22లో దెబ్బతిన్న డిస్‌ప్లే, బెంట్ ఛార్జింగ్ పోర్ట్ లేదా ఫ్లాట్ బ్యాటరీని భర్తీ చేసేందుకు రిపేర్ గైడ్‌లు, సరసమైన భాగాలను సులభంగా యాక్సెస్ చేయవచ్చని నోకియా తెలిపింది. కొత్త G-సిరీస్‌లో 100 శాతం రీసైకిల్ ప్లాస్టిక్ బ్యాక్, మెరుగైన బాస్, క్లియర్ సౌండ్‌ని అందించే OZO ప్లేబ్యాక్, అలాగే 2ఏళ్ల AndroidTM OS అప్‌గ్రేడ్‌లు, 3ఏళ్ల నెలవారీ సెక్యూరిటీ అప్‌డేట్‌లు, అదనపు ఖర్చు లేకుండా పొడిగించిన 3 ఏళ్ల పాటు వారంటీ అందిస్తుంది.

నోకియా C22 అత్యంత మన్నికైనది :
నోకియా C22 ఫోన్ హై క్వాలిటీతో వస్తుందని పేర్కొంది. ప్రొటెక్షన్ కోసం ఫోన్ IP52 రేట్ అయింది. ఈ ఫోన్‌లో పటిష్టమైన 2.5D డిస్‌ప్లే గ్లాస్, స్ట్రాంగ్ పాలికార్బోనేట్ యూనిబాడీ డిజైన్‌లో ఉన్నాయి. ఫోన్ మెరుగైన 13MP కెమెరాతో వస్తుంది. ఐరోపాలో తయారీ కి సంబంధించి ఏర్పాట్ల కోసం మొదటి దశను ప్రకటించింది.

Read Also : NoiseFit Halo Smartwatch : 150కిపైగా క్లౌడ్ వాచ్ ఫేస్‌లతో నాయిస్‌ఫిట్ హాలో స్మార్ట్‌వాచ్, కేవలం రూ. 3,999 మాత్రమే..!

నోకియా C32 : కెమెరా ఫోకస్డ్ ఫోన్ :
నోకియా C32 50-MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. కఠినమైన గ్లాస్ ఫినిషింగ్, సొగసైన, స్ట్రెయిట్ సైడ్‌వాల్‌లతో వస్తుంది. C-సిరీస్‌కు ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13తో వస్తుంది. నోకియా C32 మోడ్రాన్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇప్పటి వరకు అత్యంత కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందిస్తుంది.

Nokia G22, C32 and C22 launched with up to three days of battery life

Nokia G22, C32 and C22 launched with up to three days of battery life

Nokia G22, C22 C32 : ధర ఎంతంటే? :
నోకియా G22 రెండు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. మెటోర్ గ్రే, లగూన్ బ్లూ, రెండు మెమరీ స్టోరేజ్ (4/64GB, 4/128GB) ఆప్షన్‌లతో వస్తుంది. ఈ డివైజ్‌కు ప్రపంచ సగటు సిఫార్సు చేసిన రిటైల్ ధర (RRP) 179 యూరోలు. సుమారుగా రూ. 15,307.21గా ఉంటుంది. మీ Nokia G22 రీప్లేస్ చేయడం లేదా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటే.. మీరు iFixit.com నుంచి 5 యూరోలకు (సుమారు రూ. 428.91) ఇంట్లోనే ఫిట్ కిట్‌ని కొనుగోలు చేయవచ్చు. రీప్లేస్‌మెంట్ పార్ట్‌లు కూడా iFixit.com నుంచి స్క్రీన్‌పై గ్లోబల్ సగటు ధర 49.95 యూరోలు (సుమారు రూ. 4,284.95 ), బ్యాటరీకి 24.95 యూరోలు (సుమారు రూ. 2,141.98)వరకు ఉంటుంది.

Nokia C32 ఫోన్ చార్‌కోల్, ఆటం గ్రీన్, బీచ్ పింక్ మూడు రంగులలో అందుబాటులో ఉంది. 3/64GB, 4/128GB రెండు మెమరీ స్టోరేజ్ ఆప్షన్‌లతో వస్తుంది. ఈ డివైజ్ ప్రపంచ సగటు RRP 139 యూరోలు (దాదాపు రూ. 11,931.95). నోకియా C22 మిడ్‌నైట్ బ్లాక్, సాండ్ రెండు రంగులలో అందుబాటులో ఉంది. 2/64GB, 3/64 GB రెండు మెమరీ స్టోరేజ్ ఆప్షన్‌లతో వస్తుంది.

ఈ డివైజ్ ప్రపంచ సగటు RRP 129 యూరోలు (దాదాపు రూ.11,065.60) ఉంటుంది. ఛార్జ్ చేసేందుకు కొత్త Nokia 65W డ్యూయల్ పోర్ట్ వాల్ ఛార్జర్‌తో వస్తుంది. ఏదైనా USB-C కేబుల్‌కు సపోర్టు చేస్తుంది. 70 శాతం రీసైకిల్ మెటీరియల్‌తో చేసిన కేస్‌ను కలిగి ఉంటుంది. మీరు Nokia.com నుంచి 49.99 యూరోలకు కొనుగోలు చేయవచ్చు. అంటే.. సుమారుగా రూ. 4,292.38 వరకు ఉంటుంది.

Read Also : iPhone 15 Series : అద్భుతమైన కలర్ ఆప్షన్లలో ఐఫోన్ 15 సిరీస్ వస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?