Eknath Shinde: బల పరీక్షపై ఆందోళన లేదు.. గెలుపు మాదే: ఏక్‍‌నాథ్ షిండే

రేపు జరగబోయే బల పరీక్షలో ఉద్ధవ్ థాక్రే ఓడిపోతాడు. స్వతంత్ర అభ్యర్థులతోపాటు మాకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మేం ఈ పరీక్షలో విజయం సాధిస్తాం. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉన్నవారిదే గెలుపు. మాకే మెజారిటీ ఉంది. మాది బాలాసాహెబ్ స్థాపించిన శివసేన.

Eknath Shinde: బల పరీక్షపై ఆందోళన లేదు.. గెలుపు మాదే: ఏక్‍‌నాథ్ షిండే

Eknath Shinde: మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం జరగబోయే అవిశ్వాస తీర్మానం విషయంలో ఎలాంటి ఆందోళన లేదని, తాము (రెబల్స్) ఈ పరీక్షలో నెగ్గుతామని ఏక్‍‌నాథ్ షిండే అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం గువహటి నుంచి గోవా వెళ్తున్న సమయంలో మీడియాతో మాట్లాడారు. తమకు అసెంబ్లీలో బలం ఉందన్నాడు.

Udaipur killing: కన్హయ్య హత్య నిందితులకు పాక్‌తో సంబంధాలు.. కేసు ఎన్ఐఏకు అప్పగింత

‘‘రేపు జరగబోయే బల పరీక్షలో ఉద్ధవ్ థాక్రే ఓడిపోతాడు. స్వతంత్ర అభ్యర్థులతోపాటు మాకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మేం ఈ పరీక్షలో విజయం సాధిస్తాం. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉన్నవారిదే గెలుపు. మాకే మెజారిటీ ఉంది. మాది బాలాసాహెబ్ స్థాపించిన శివసేన. ఆయన హిందూత్వ సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్తాం. మాది మహారాష్ట్రను, ప్రజలను ముందుకు నడిపే శివసేన. మేం రేపు బాలాసాహెబ్ స్మృతిస్థల్ కూడా సందర్శిస్తాం’’ అని వ్యాఖ్యానించారు. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఉద్ధవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షిండే వర్గ ఎమ్మెల్యేలు ఓటు వేస్తే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం.

Fine To BJP: డిజిటల్ బోర్డు… బీజేపీకి జీహెచ్ఎంసీ ఫైన్

అదే జరిగితే షిండే తనతోపాటు ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. మరోవైపు రేపటి అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేయాలని కోరుతూ శివసేన పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు విచారణ జరుగుతుంది. ఈ తీర్పును బట్టి రేపు విశ్వాస పరీక్ష జరుగుతుంది.