Nothing Phone 2 : భారత్‌కు నథింగ్ ఫోన్ (2) వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Nothing Phone (2) : నథింగ్ ఫోన్ (2) అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. రాబోయే నథింగ్ ఫోన్ (2) స్మార్ట్‌ఫోన్ ఏయే ఫీచర్లతో రానుంది కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. కానీ, ధర ఎంత, ఫీచర్లు ఇవేనంటూ లీక్ డేటా రివీల్ చేసింది.

Nothing Phone (2) India launch Soon _ Check Leaked Specifications
Nothing Phone 2 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు నథింగ్ ఫోన్ (2) త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. ఈ 5G ఫోన్ ఎప్పుడు అనేది కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. నథింగ్ ఫోన్ (2) ఈ వేసవిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నథింగ్ ఫోన్ (2) ఏయే ఫీచర్లుతో రానుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
నథింగ్ ఫోన్ (2) ఫీచర్ ఇదే :
నథింగ్ ఫోన్ (2)లో Qualcomm, SVP, మొబైల్, కంప్యూట్ XR యూనిట్ల GM అలెక్స్ కటౌజియన్, లింక్డ్‌ఇన్‌లో అనుకోకుండా నథింగ్ ఫోన్ (2) స్నాప్‌డ్రాగన్ 8+ Gen 2 SoCతో వస్తుందని ధృవీకరించారు. లేటెస్ట్ కానప్పటికీ, ఇటీవలి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఇదే పవర్ చిప్. ఈ ఫ్లాగ్‌షిప్ చిప్ కారణంగా నథింగ్ ఫోన్ ధర గత మోడల్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. భారత మార్కెట్లో ఫస్ట్ జనరేషన్ నథింగ్ ఫోన్ (1) రూ. 32,999 ధరతో రానుంది. ఈ హ్యాండ్‌సెట్ హుడ్ కింద మిడ్-రేంజ్ స్నాప్‌డ్రాగన్ 778G+ చిప్‌తో రానుంది.
నథింగ్ ఫోన్ (2) స్పెసిఫికేషన్‌లు లీక్ :
నథింగ్ ఫోన్ (2) FHD+ డిస్‌ప్లేతో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫ్రంట్ సైడ్ పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను చూడవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో మార్పు కనిపిస్తుందో లేదో తెలియదు. ఈ ఫోన్ కొన్ని స్వల్ప మార్పులతో వచ్చే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి.

Nothing Phone 2 India launch Soon _ Check Leaked Specifications
బ్యాక్ సైడ్ సెమీ-పారదర్శక డిజైన్‌ను చూడవచ్చు. స్టేబుల్ షాట్‌లకు OISకి సపోర్టుతో 50-MP ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇతర సెన్సార్ల వివరాలు ఇంకా తెలియరాలేదు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 OS సాఫ్ట్‌వేర్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది. గత ఏడాదిలో కంపెనీ మోడల్‌తో సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను అందించింది.
హుడ్ కింద 5,000mAh బ్యాటరీని కూడా చూడవచ్చు. 33W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్టుతో మునుపటి మోడల్‌లో 4,500mAh యూనిట్ కన్నా పెద్ద అప్‌గ్రేడ్ అవుతుంది. కంపెనీ 67W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు అందిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో పొందవచ్చు. రాబోయే ఈ ఫోన్ ధర రూ. 40వేల రేంజ్‌లో ఉండవచ్చని స్పెసిఫికేషన్లు సూచిస్తున్నాయి. కానీ, లీకైన స్పెసిఫికేషన్లు కేవలం ఊహాగానాలు మాత్రమే. పైన పేర్కొన్న వివరాలపై కంపెనీ ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు.