RRR : అక్కడ రిలీజ్‌కి సిద్దమవుతున్న ఆర్ఆర్ఆర్.. మరో కొత్త రికార్డులకు సిద్ధం!

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టించిన RRR.. ఇంకా తన మ్యానియాని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా ఆ భాషలో రిలీజ్ కి సిద్దమవుతుంది.

RRR : అక్కడ రిలీజ్‌కి సిద్దమవుతున్న ఆర్ఆర్ఆర్.. మరో కొత్త రికార్డులకు సిద్ధం!

NTR Ram Charan rajamouli RRR ready to released in japanese language

Updated On : June 17, 2023 / 7:48 AM IST

RRR : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. బిఫోర్ ఇండిపెండెన్స్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమాలో చరణ్ – అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ – కొమరం భీం పాత్రలో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. హాలీవుడ్ ఆడియన్స్ ని కూడా వీరిద్దరి నటన, రాజమౌళి టేకింగ్ బాగా అలరించాయి. దీంతో హాలీవుడ్ లో సైతం పలు అవార్డులను సొంతం చేసుకునేలా చేసింది.

Pawan Kalyan : నాకు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం, ప్రభాస్ ఇష్టం.. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్!

ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ (Oscar) అవార్డుని కూడా కైవసం చేసుకుంది. ఈ సినిమా కోసం ఎం ఎం కీరవాణి ఇచ్చిన నాటు నాటు (Naatu Naatu) సాంగ్ వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్కర్ని ఉరూతలూగించింది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా ఇప్పటికే జపాన్ రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 21న జపాన్ లో మూవీ రిలీజ్ అయింది. ఆ సమయంలో మూవీ టీం కూడా అక్కడ ప్రమోషన్స్ కోసం వెళ్లి సందడి చేశారు. అయితే అప్పుడు తెలుగు వెర్షన్ కి జపనీస్‌ సబ్‌ టైటిల్స్‌తో రిలీజ్ చేశారు.

Ram Charan – Upasana : బిడ్డ పుట్టాక పూర్తి బాధ్యత చిరంజీవిదే అంటున్న ఉపాసన.. అత్తమామల దగ్గరకు షిఫ్ట్‌!

తాజాగా ఇప్పుడు జపాన్‌ భాషలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. జులై 28న ఈ సినిమాని జపనీస్‌ లాంగ్వేజ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. కాగా సబ్‌ టైటిల్స్‌తో రిలీజ్ అయిన మూవీనే 200 రోజులు పైగా పూర్తి చేసుకొని 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. అంతేకాదు అక్కడ పలు ఇంటర్నేషనల్ ఫిలిం రికార్డ్స్ తో పాటు కొన్ని జపాన్ మూవీస్ రికార్డ్స్ ని సైతం బ్రేక్ చేసింది. మరి ఇప్పుడు జపాన్ భాషలో రిలీజ్ అవుతుంది. ఇంకెన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి.