NTR30 : జాన్వీ పోస్ట్, ఎన్టీఆర్ కామెంట్.. వైరల్ అవుతున్న పోస్ట్!

NTR30 సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ చేయబోతుంది అంటూ ఇవాళ చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ దీని పై స్పందిస్తూ జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ వేయగా.. దానికి ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యాడు.

NTR30 : జాన్వీ పోస్ట్, ఎన్టీఆర్ కామెంట్.. వైరల్ అవుతున్న పోస్ట్!

ntr reacts for Janhvi Kapoor instagram post

NTR30 : RRR వంటి గ్లోబల్ వైడ్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ నుంచి తదుపరి సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు జనరల్ ఆడియన్స్ కూడా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. గత ఏడాదే టాప్ డైరెక్టర్స్ అయిన కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో సినిమాలు ప్రకటించినప్పటికీ.. ఇప్పటి వరకు అవి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోలేదు. ఈ ఫిబ్రవరి నెలలోనే ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా పూజా కార్యక్రమం జరగాల్సి ఉండగా.. నందమూరి తారకరత్న మరణం వలన వాయిదా పడింది.

Janhvi Kapoor : #NTR30 అప్డేట్.. అనుకున్నదే అయింది.. ఎన్టీఆర్ సినిమాలో జాన్వీనే హీరోయిన్..

కాగా నిన్న (మార్చి 5) రాత్రి ఈ సినిమా గురించి కీలకమైన అప్డేట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన మూవీ టీం.. ఈరోజు ఉదయం ఆ అప్డేట్ ని ప్రకటించారు. ఈ సినిమాలో మొదటి నుంచి హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు జాన్వీ బర్త్ డే కావడంతో.. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ NTR30 ప్రాజెక్ట్ లోకి వెల్కమ్ అంటూ ప్రకటన చేశారు. అంతేకాదు మూవీలోని జాన్వీ లుక్ ని కూడా రివీల్ చేశారు. ఇక ఈ ఫోటోని జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. ‘నా ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాను’ అంటూ రాసుకొచ్చింది.

ఈ పోస్ట్ కి ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ.. ”హ్యాపీ బర్త్ డే జాన్వీ కపూర్. NTR30 ప్రాజెక్ట్ లోకి వెల్కమ్. ఈ సినిమా నీ కెరీర్ లో గొప్పదిగా నిలవాలని కోరుకుంటున్నాను” అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ తో సాగనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ పని చేయనున్నారు. ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి రాగానే ఈ మూవీ లాంచ్ అండ్ రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు చేప్పట్టనున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)