Healthy Food : పిల్లల ఎదుగుదలలో పోషకాహారమే కీలకం!

బీన్స్‌, చిక్కుడు, పుట్టగొడుగులు, పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే సెలెనియం చిన్నారులకు ఎక్కువగా అందించాలి. వీటిల్లో ఉండే ఖనిజలవణాల్లో ఒకటైన సెలెనియం యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

Healthy Food : పిల్లల ఎదుగుదలలో పోషకాహారమే కీలకం!

Healthy Food

Healthy Food : ఎదిగే వయస్సు పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. సరైన పోషకాహారాన్ని పిల్లలకు అందేలా చూసుకోవాలి. దీని వల్ల వారిలో వ్యాధినిరోధక శక్తి పెరగటమే కాకుండా మానసిక , శారీరక ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. పిల్లల ఆహారం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఎదుగదలపై ప్రభాం చూపించటంమే కాకుండా అనారోగ్య సమస్యలు చుట్టుమేట్టే అవకాశం ఉంటుంది. పిల్లలకు ఇవ్వాల్సిన పోషకాహారంపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.

తగినంత పోషకాహారం పిల్లల పెరుగుదల, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం. సమతుల్య ఆహారంలో అవసరమైన మొత్తంలో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ తగిన మొత్తంలో ఉండాలి. ఈ పోషకాలలో ప్రతి ఒక్కటి పిల్లల పెరుగుదల,అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయి. స్థూల , సూక్ష్మ పోషకాల తీసుకోవడంలో లోపం ఏర్పడితే అది పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్దితి చివరికి ఇన్ఫెక్షన్స్ కు, బలహీనమైన రోగనిరోధక శక్తికి దారితీస్తుంది. దీని ఫలితతంగా పిల్లలు వయస్సుకి తగ్గ ఎదుగుదల ఉండకపోవచ్చు. పిల్లల వయస్సు తగిన ఎదుగుదలని సాధించడంలో సహాయపడటానికి పోషకాహారం అనేది చాలా కీలకం.

కండరాలు బలోపేతంగా ఉండాలంటే జింక్‌, ఐరన్‌ ఉండే ఆహారాలను పిల్లలు తీసుకునే చూడాలి. పచ్చని ఆకుకూరలు, కూరగాయలతో పాటు గుమ్మడి విత్తనాలు, గుడ్డు, మాంసాహారం అందించాలి. వీటి ద్వారా జీవక్రియలను సక్రమంగా ఉండేలా చూడవచ్చు. చిన్నవయస్సు నుండే పోషకవిలువలున్న ఆహారం అందిస్తే పిల్లల ఎదుగుదల బాగా ఉంటుంది. అదే విధంగా విటమిన్ సి ఉండే ఆహారాలను పిల్లలకు అందించాలి. కాలీఫ్లవర్‌, బ్రొకోలీ,బెల్‌పెప్పర్స్‌, వంటి తాజా కూరగాయలు, నారింజ, బత్తాయి, పైనాపిల్‌, జామ, స్ట్రాబెర్రీ, బొప్పాయి వంటి పండ్లు రోజవారి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటిలో పుష్కలంగా విటమిన్‌ సి లభిస్తుంది. పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరగటానికి ఈ ఆహారాలు దోహదం చేస్తాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వీటిల్లో ఉండే ఐరన్‌ వల్ల రక్తలోపం నిరించబడుతుంది. పండ్లలోని పీచు జీర్ణశక్తిని పెంచుతుంది.

బీన్స్‌, చిక్కుడు, పుట్టగొడుగులు, పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే సెలెనియం చిన్నారులకు ఎక్కువగా అందించాలి. వీటిల్లో ఉండే ఖనిజలవణాల్లో ఒకటైన సెలెనియం యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అమినో యాసిడ్‌ ఉండే పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసాహారం, గింజలు వంటివి పిల్లల ఎదుగుదలకు ఉపకరిస్తాయి. అంతేకాకుండా వెజిటబుల్‌ ఆయిల్స్‌, గింజధాన్యాలు, విత్తనాలు, ఆకుకూరలతోపాటు ఆకుపచ్చగా ఉండే కూరగాయలన్నింటినీ పిల్లల ఆహారంలో భాగం చేయాలి. వీటిలోని విటమిన్‌ ఈ కణ విభజనలో ప్రధానపాత్రను పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల నరాల వ్యవస్థ బలోపేతం అవుతుంది. విటమిన్‌ ఈ వ్యాధినిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది. విటమిన్‌ కే2 ఎముకలకు క్యాల్షియం అందేలా చేస్తుంది. పులియబెట్టిన పెరుగు వంటి ఆహారంతోపాటు గుడ్డు, మాంసాహారం ద్వారా కే2 విటమిన్‌ పిల్లల ఎముకలను బలోపేతం చేస్తుంది.

శారీరకంగా చురుగ్గా ఉండటం వల్ల పిల్లలు మీరు అనుకున్నదానికంటే ఎక్కువగా ఎదుగుదలలో మెరుగ్గా ఉంటారు. శారీరకంగా చురుకుగా ఉన్న పిల్లలు మెరుగైన మెదడు పనితీరును కలిగి ఉంటారు చదువుల్లోనూ ముందుంటారు. సమతుల్య ఆహారం మీ బిడ్డ ఆరోగ్యంగా , ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా ఎదగటానికి సహాయపడుతుంది.