OnePlus 10T 5G: ఆగ‌స్టు 3న‌ వన్‌ప్లస్ 10T 5జీ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ 10T స్మార్ట్‌ఫోన్‌లో 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉండ‌నున్నాయి. ఈ విష‌యాన్ని వ‌న్‌ప్ల‌స్ నిర్ధారించింది. ఇప్ప‌టికే వ‌న్‌ప్ల‌స్ 256 జీబీ స్టోరేజ్ ఫోన్లు ఉన్నాయి.. అయితే, 16జీబీతో లేవు.

OnePlus 10T 5G: ఆగ‌స్టు 3న‌ వన్‌ప్లస్ 10T 5జీ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌

Mobile

OnePlus 10T 5G: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ 10T 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆగ‌స్టు 3న విడుద‌ల చేయ‌నున్నారు. భార‌త కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంట‌ల‌కు ఈ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉండ‌నున్నాయి. ఈ విష‌యాన్ని వ‌న్‌ప్ల‌స్ నిర్ధారించింది.  ఇప్ప‌టికే వ‌న్‌ప్ల‌స్ 256 జీబీ స్టోరేజ్ ఫోన్లు ఉన్నాయి.. అయితే, 16జీబీతో లేవు. స్నాప్‌డ్రాగ‌న్ 8+ Gen 1 SoC, 16జీబీ LPDDR5 ర్యామ్, 256జీబీ UFS 3.1 బిల్డ్ ఇన్ స్టోరేజీతోనూ విడుద‌ల చేయ‌నున్నారు. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సామ‌ర్థ్యంతో వన్‌ప్లస్ 10T స్మార్ట్‌ఫోన్ వ‌స్తోంది.

డిస్‌ప్లే 6.7 inches (17.02 cm)394 PPI ఉంటుంది. 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమ‌రీ కెమెరాలు LED Flash16 MP ఫ్రంట్ కెమెరా ఉంటాయి. పూర్తి-HD వీడియో రికార్డింగ్‌కు మాత్రమే సపోర్టు ఇస్తుంది. కంపెనీకి సంబంధించిన కొత్త ఇమేజ్ క్లారిటీ ఇంజ‌న్ ఉంటుంద‌ని చెప్పింది. HDR 5.0, TurboRAW algorithms వాడామ‌ని పేర్కొంది. 4800 బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో 150W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల అవుతుంది. వన్‌ప్లస్ 10T స్మార్ట్‌ఫోన్‌తో పాటు OxygenOS 13 కూడా ఆగ‌స్టు 3నే విడుద‌ల కానుంది. OnePlus 10T స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ.49,999గా ఉంటుంద‌ని అంచ‌నా.