OnePlus Nord 2T Update : వన్‌ప్లస్ నార్డ్ 2T స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13OS స్టేబుల్ అప్‌డేట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవిగో.. చెక్ చేసుకోండి!
OnePlus Nord 2T Update : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) కొత్త మోడల్ (OnePlus Nord 2T)లో Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ వచ్చేసింది.

OnePlus Nord 2T finally gets Android 13 OS stable update _ Check out new features and other details
OnePlus Nord 2T Update : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) కొత్త మోడల్ (OnePlus Nord 2T)లో Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ నార్డ్ 2T డివైజ్‌లో లేటెస్ట్ స్టేబుల్ OxygenOS 13 అప్‌డేట్ వచ్చింది. డిసెంబర్‌లో Android సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌ను ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‌తో Google ప్యాక్‌లో కొన్ని Android goodiesను అందిస్తుంది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ రిలీజ్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కొత్త అప్‌డేట్ చాలా పెద్దదిగానూ అనేక ఫీచర్లను కలిగి ఉంది. దాదాపు 4.65GB సైజులో ఉంటుంది. OnePlus Nord 2T యూజర్లు మొబైల్ డేటాను కోల్పోకుండా ఉండేందుకు Wi-Fi నెట్‌వర్క్‌ని ఉపయోగించి అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు యూజర్లు ఫోన్‌లో కనీసం 30 శాతం బ్యాటరీని ఉంచుకోవాలి.

OnePlus Nord 2T finally gets Android 13 OS stable update
ఈ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆక్వామార్ఫిక్ డిజైన్ థీమ్ కలర్లను టైమ్ జోన్‌లలో సమయాన్ని చూపించేందుకు హోమ్ స్క్రీన్ వరల్డ్ క్లాక్ విడ్జెట్‌ను యాడ్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. కొత్త బిహేవియర్ రికగ్నిషన్ ఫీచర్‌తో డివైజ్ క్వాంటమ్ యానిమేషన్ ఇంజిన్ 4.0 వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేస్తుంది.
మీరు డేటాను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేసేందుకు విడ్జెట్ డిజైన్‌ను ఆప్టిమైజ్ చేసినట్లు OnePlus క్లెయిమ్ చేస్తోంది. ఈ కొత్త అప్‌డేట్ షేప్, ఫాంట్‌లు, సిస్టమ్ ఐకాన్లను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు హోమ్ స్క్రీన్‌లో పెద్ద ఫోల్డర్‌లను చూడవచ్చు. ఇప్పుడు ఒకే ట్యాప్‌తో విస్తరించిన ఫోల్డర్‌లో యాప్‌ను ఓపెన్ చేసి స్వైప్‌తో ఫోల్డర్‌లోని పేజీలను టర్న్ చేయవచ్చు. OnePlus మీడియా ప్లేబ్యాక్ కంట్రోల్ కూడా యాడ్ చేసింది.
క్విక్ సెట్టింగ్ కూడా ఆప్టిమైజ్ చేసింది. స్క్రీన్‌షాట్ ఎడ్జెస్ట్ కోసం మరిన్ని మార్కప్ టూల్స్ కూడా చూడవచ్చు. ఈ డివైజ్ హోమ్ స్క్రీన్‌కు విడ్జెట్‌లను యాడ్ చేయడానికి కూడా సపోర్టును పొందుతుంది. అప్‌డేట్ సైడ్‌బార్ టూల్‌బాక్స్‌ను కూడా యాడ్ చేసింది. పాపులర్ ఆపరేషన్ కోసం యాప్‌ల లోపల ఫ్లోటింగ్ విండోను ఓపెన్ చేయవచ్చు. అప్‌డేట్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీరు హోమ్ స్క్రీన్‌పై కిందికి స్వైప్ చేస్తే.. మీరు షెల్ఫ్‌ను యాక్సెస్ చేయవచ్చు.

OnePlus Nord 2T finally gets Android 13 OS stable update
OnePlus స్క్రీన్‌క్యాస్ట్‌ను ఆప్టిమైజ్ చేసింది. కంటెంట్ ఇప్పుడు లక్ష్య స్క్రీన్‌కు ఆటోమాటిక్‌గా మారుతుంది. లేటెస్ట్ అప్‌డేట్‌తో మరింత కేటగిరీ చేసిన డిస్‌ప్లే సెట్టింగ్‌లు యూజర్లకు అందుబాటులో ఉంటాయి. చాట్ స్క్రీన్‌షాట్‌ల కోసం ఆటోమేటిక్ పిక్సెలేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. సిస్టమ్ మీ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి చాట్ స్క్రీన్‌షాట్‌లో ప్రొఫైల్ ఫొటోలను డిస్‌ప్లే పేర్లను గుర్తించవచ్చు.
అలాగే, ఆటోమాటిక్‌గా పిక్సలేట్ చేయగలదని OnePlus తెలిపింది. కంపెనీ మరో బెస్ట్ ప్రైవసీ ఫీచర్ యూజర్ల ప్రైవసీ కోసం క్లిప్‌బోర్డ్ డేటా సాధారణ క్లియరింగ్‌ను యాడ్ చేస్తుంది. అప్‌డేట్ ప్రైవేట్ సేఫ్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది, సిస్టమ్ స్పీడ్ పెరగడానికి డైనమిక్ కంప్యూటింగ్ ఇంజిన్‌ను యాడ్ చేస్తుంది. మెరుగైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం హైపర్‌బూస్ట్ GPA 4.0 వెర్షన్‌ను అందిస్తుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..