OTT Platforms: ఓటీటీ వందల కోట్ల ఆఫర్స్.. హాట్ కేక్‌లా బిగ్ మూవీస్!

రిలీజ్ కి ముందే భారీ ప్రాజెక్ట్స్ కొన్ని భారీ ఓటీటీ డీల్స్ తో ట్రెండ్ అవుతున్నాయి. షారుఖ్, సల్మాన్, ఆమీర్ లాంటి బాలీవుడ్ హీరోలు.. వాళ్ల రేంజ్ ఏంటో ఓటీటీ రేట్ తోనే చూపిస్తున్నారు. వీళ్ల సినిమా ఎప్పుడొస్తుందా అని ఎప్పటినుంచో వెయిట్ చేస్తోన్న ఫ్యాన్స్ కు..

OTT Platforms: ఓటీటీ వందల కోట్ల ఆఫర్స్.. హాట్ కేక్‌లా బిగ్ మూవీస్!

OTT Platforms: రిలీజ్ కి ముందే భారీ ప్రాజెక్ట్స్ కొన్ని భారీ ఓటీటీ డీల్స్ తో ట్రెండ్ అవుతున్నాయి. షారుఖ్, సల్మాన్, ఆమీర్ లాంటి బాలీవుడ్ హీరోలు.. వాళ్ల రేంజ్ ఏంటో ఓటీటీ రేట్ తోనే చూపిస్తున్నారు. వీళ్ల సినిమా ఎప్పుడొస్తుందా అని ఎప్పటినుంచో వెయిట్ చేస్తోన్న ఫ్యాన్స్ కు.. వందల కోట్ల డిజిటల్ ఫ్యాన్సీ డీల్స్ మాంచి కిక్కిస్తున్నాయి.

OTT Platforms: ఓటీటీల పోటీ.. స్ట్రీమింగ్ రైట్స్ కోసం కాంపిటీషన్

హై రేంజ్ ఓటీటీ డీల్స్ తో ఇండియన్ భారీ ప్రాజెక్ట్స్ కొన్ని చుక్కలు చూపిస్తున్నాయి. పాండెమిక్ టైమ్ లో మినిమం బడ్జెట్ సినిమాలకు వరంగా మారిన డిజిటల్ ప్లాట్ ఫామ్స్.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత హై బడ్జెట్ సినిమాలకూ క్రేజీ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా షారుఖ్, సల్మాన్, ఆమీర్ లాంటి స్టార్స్ నటిస్తోన్న సినిమాలను ఎవరూ ఊహించని రేటుకు ఓటీటీ సంస్థలు దక్కించుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

OTT Platforms: మేకర్స్ కు ఓటీటీ బిగ్ ఆఫర్స్.. ఊ అంటారా.. ఊహూ అంటారా!

షారుఖ్ మోస్ట్ అవైటైడ్ మూవీ పఠాన్. సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్షన్ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ 2023 జనవరి 25న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ 210 కోట్లకు దక్కించుకుందనే గాసిప్ ఇప్పుడు వైరలవుతోంది. ఈ విషయాన్ని పఠాన్ ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిల్మ్స్ కూడా కొట్టేయలేదు. ఈ లెక్కన షారుఖ్ పఠాన్ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ ఏ లెవెల్ లో ఉన్నాయో తెలుస్తోంది.

OTT platformsలో ALTBalaji.. adult కంటెంట్ కాదు లోకల్ కంటెంట్ మాత్రమే

షారుఖ్ మాత్రమే కాదు ఓటీటీ రేస్ లో సల్మాన్ కూడా తగ్గేగే లే అంటున్నాడు. తనకు కలిసొచ్చిన ఫ్రాంచైజ్ లో టైగర్ 3 చేస్తున్నాడు సల్మాన్. కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ కీ రోల్స్ చేస్తోన్న ఈ సినిమా 2023 ఏప్రిల్ 21 ఈద్ స్పెషల్ గా రిలీజ్ కానుంది. అయితే ఈలోపు టైగర్ 3 ఓటీటీ రైట్స్ 200 కోట్లకు అమ్ముడైనట్టు వస్తోన్న న్యూస్ సల్లూభాయ్ ఫ్యాన్స్ కు ఊపునిస్తోంది. ఇంత భారీ రేట్ కు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

Star’s OTT Entry: హాట్ కేక్‌లా ఓటీటీ.. సై అంటున్న స్టార్స్!

షారుఖ్, సల్మాన్ తర్వాత హైయ్యెస్ట్ ఓటీటీ డీల్స్ లిస్ట్ లో ఆమీర్ ఖాన్ సినిమా కూడా చేరింది. ఆమీర్ తో కరీనా కపూర్, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న లాల్ సింగ్ చద్దా కోసం ఓ ఓటీటీ సంస్థ ఏకంగా 160 కోట్లు సమర్పించుకున్నట్టు చెప్తున్నారు. కాగా ఈ కామెడీ డ్రామా ఈ సంవత్సరం ఆగస్ట్ 11న ఆడియెన్స్ ముందుకు రానుంది.

OTT Series: క్రైమ్ క్రేజ్.. ఓటీటీల్లో విశ్వరూపం చూపిస్తున్న హీరోయిన్లు!

క్యూట్ కపుల్ రణ్ బీర్, ఆలియా ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తోన్న సినిమా బ్రహ్మాస్త్ర. మూడు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది సెప్టెంబర్ 9న థియేటర్స్ కి రానుంది. అమితాబ్, నాగార్జున లాంటి వాళ్లు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు బ్రహ్మాస్త్రలో. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ దాదాపు 150 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఈ డీల్ తో నైనా ఫాంటసీ థ్రిల్లర్ బ్రహ్మాస్త్రలో బాగానే విషయముందని అర్ధం చేసుకోమంటున్నారు రణ్లియా ఫ్యాన్స్.

OTT Release: భారీ సినిమాలు.. ఈ నెలలో ఓటీటీలో బిగ్ ఫెస్టివల్!

ఇక సంచలనాలకు మారు పేరుగా మారిన సినిమా కేజీఎఫ్2. సౌత్, నార్త్ అని తేడా లేకుండా రికార్డులు కొట్టడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు రాఖీభాయ్. ఇప్పుడు కొత్తగా ఫ్యాన్సీ ఓటీటీ రేట్ దక్కించుకొని మరో రికార్డ్ సెట్ చేశాడు. ఆల్రెడీ కెజిఎఫ్ చాప్టర్ 1ను స్ట్రీమింగ్ చేస్తోన్న అమెజాన్ ప్రైమ్.. చాప్టర్ 2 కోసం ఏకంగా 140 కోట్లు చెల్లించిందని అంటున్నారు.

Pushpa: పుష్ప సినిమాను మిస్ చేసుకున్న ఐదుగురు స్టార్స్.. ఎవరో తెలుసా?

రాజమౌళి ట్రిపుల్ ఆర్ కూడా 150 కోట్ల వరకు ఓటీటీ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ చివరి దశకు వచ్చిన ఈ సినిమా జూన్ ఫస్ట్ వీక్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ట్రిపుల్ ఆర్ హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో.. సౌత్ లాంగ్వెజెస్ అన్ని వర్షన్స్ జీ5లో రిలీజ్ కానున్నాయి.

OTT Release: ఓటీటీల హవా.. థియేటర్లను బీట్ చేసే కంటెంట్ సిద్ధం!

రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సైతం భారీ రేట్ కే ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. దాదాపు 125 కోట్ల పెట్టుబడితో ప్రముఖ ఓటీటీ సంస్థ పొన్నియిన్ సెల్వన్ ను దక్కించుకుంది. ఐశ్వర్యరాయ్, విక్రమ్, కార్తీ, త్రిషా, జయం రవి ఇలా… భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతోన్న ఈ హిస్టారికల్ డ్రామా ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల కానుంది.