OTT Release: భారీ సినిమాలు.. ఈ నెలలో ఓటీటీలో బిగ్ ఫెస్టివల్!

ఓటీటీ ఫిల్మ్ ఫెస్టివల్ కు మే నెల వేదిక కానుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్రేజీ సినిమాలు థియేటర్స్ కి వచ్చేసాయి. ఇప్పుడవి ఇంటికి కూడా వచ్చేందుకు ముహూర్తం పెట్టేసుకున్నాయి. మరోవైపు భారీ డిజాస్టర్స్ కు సైతం ఓటీటీలు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి.

OTT Release: భారీ సినిమాలు.. ఈ నెలలో ఓటీటీలో బిగ్ ఫెస్టివల్!

Ott Release

OTT Release: ఓటీటీ ఫిల్మ్ ఫెస్టివల్ కు మే నెల వేదిక కానుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్రేజీ సినిమాలు థియేటర్స్ కి వచ్చేసాయి. ఇప్పుడవి ఇంటికి కూడా వచ్చేందుకు ముహూర్తం పెట్టేసుకున్నాయి. మరోవైపు భారీ డిజాస్టర్స్ కు సైతం ఓటీటీలు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి. థియేటర్స్ లో ప్లాప్ కొడితే ఎర్లీ బర్డ్స్ గా హోమ్ బాట పడుతున్నాయి. సరే మొత్తంగా ఈ నెలలో డిజిటల్ ప్లాట్ ఫాం పై సందడి చేయబోతున్న సినిమాలపై ఓ లుక్..

RRR-KGF2: కలెక్షన్ల సునామి.. దెబ్బకు బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు!

తారక్, చరణ్ చేతులు కలపడం.. అదీ రాజమౌళి సమక్షంలో అన్నప్పుడు ఎగిరి గంతేశారు నందమూరి, మెగా అభిమానులు. కొవిడ్ కారణంగా సాగి సాగి కొన్నేళ్ల నిరీక్షణ తర్వాత ట్రిపుల్ ఆర్ థియేటర్స్ కి రావడం.. సినిమాపై రకరకాల డిబేట్స్ జరుగడం.. మొత్తంగా లాంగ్ రన్ లో 1100 కోట్లకు పైగా రాబట్టడం జరిగిపోయాయి. ఇంకా కొన్ని హాళ్లలో 50 రోజుల వేడుక కోసం ట్రిపుల్ ఆర్ ను నడిపిస్తున్నారు. అయితే ఈగర్ గా వెయిట్ చేస్తోన్న హోమ్ ఆడియెన్స్ కోసం మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది ఆర్ఆర్ఆర్. ఈ విజువల్ గ్రాండియర్ ఈ నెల 20న తెలుగుతో పాటూ సౌత్ వెర్షన్ష్ జీ5లో, హిందీ డబ్బింగ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

KGF2: అఫీషియల్.. వెయ్యి కోట్ల క్లబ్‌లో కేజీయఫ్2

మొత్తంగా వెయ్యి కోట్లను ఈజీగా క్రాస్ చేసి హిందీతో పాటూ కన్నడ, తెలుగు, తమిళ్.. ఇలా నాలుగు భాషల్లో 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఏకైక ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డ్ రాఖీభాయ్ సృష్టించాడు. సంచలనాలకు మారు పేరుగా మారిన కేజీఎఫ్2పై కూడా ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తోంది. రాకింగ్ స్టార్ అభిమానుల్ని మరింత ఉర్రూతలూగించేదుకు కేజీఎఫ్ చాప్టర్ 2ను మే 27న ప్రైమ్ లో విడుదల చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Beast Closing Collections : తెలుగులో బీస్ట్ క్లోజింగ్ కలెక్షన్స్.. దిల్ రాజుకి భారీ నష్టాలు..

పేరుకు పాన్ ఇండియా వైడ్ రిలీజ్.. సంపాదన మాత్రం కేవలం తమిళ్ కే పరిమితమైన సినిమా బీస్ట్. థియేటర్స్ లో ఆల్ మోస్ట్ రన్ ని కంప్లీట్ చేసుకున్న విజయ్ బీస్ట్.. ఇప్పుడు అన్ని భాషల్లో కూడా ఓటిటి రిలీజ్ కి డేట్ చేసుకుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న ఓటీటీ యాప్ నెట్ ఫ్లిక్స్ లో మే 11 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది బీస్ట్. అలాగే నెట్ ఫ్లిక్స్ తో పాటు సన్ నెక్స్ట్ లో కూడా మే 11 నుంచి బీస్ట్ షో వేయబోతున్నారు.

Acharya: మరో పది రోజుల్లో ఆచార్య వచ్చేస్తున్నాడా..?

ఈమధ్య థియేటర్స్ లో సరిగా ఆడని సినిమాలను వెంటనే ఓటీటీకి తీసుకొచ్చి ఎంతోకొంత సొమ్ము చేసుకంటున్నారు నిర్మాతలు. రాధేశ్యామ్, గని లాంటివి ఆ బాపతుకు చెందినవే. ఇప్పుడీ లైన్ లోకి ఆచార్య కూడా వచ్చేస్తోంది. పండుగ సెలవులున్నా మినిమం అమౌంట్ కూడా రాబట్టలేక రిలీజైన మూడో రోజే చేతులెత్తేసాడు ఆచార్య. అయితే నాలుగు వారాల విండో గ్యాప్ తో ఆచార్యను కొనేసిన ఓటీటీ ప్రైమ్.. ఇప్పుడా సినిమాను త్వరగా స్ట్రీమింగ్ చేసేందుకు మరో 18 కోట్లను చెల్లించిందని చెప్తున్నారు. ఈ లెక్కన ఈ నెలలోనే అతిత్వరలో ఆచార్య ఓటీటీ రిలీజ్ ఉంటుంది. ఇలా మే నెల మొత్తం స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ కు పండగే.