Hindus in Pakistan: పాకిస్థాన్‌లో ఎన్ని లక్షల మంది హిందువులు నివసిస్తున్నారో తేల్చిన ఎన్ఏడీఆర్ఏ నివేదిక

పాకిస్థాన్ అంటే ముస్లింల దేశం అని అందరికీ తెలిసిందే. ఈ దేశంలోనూ ముస్లీమేతర ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అయితే వారి సంఖ్య కొద్దిమొత్తంలోనే ఉంటుంది. తాజాగా నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ (NADRA) నివేదిక ఆధారంగా.. ఈ ఏడాది మార్చి వరకు పాకిస్థాన్ లో మొత్తం జనాభా 18,68,90,601 ఉండగా.. వీరిలో 18,25,92,000 మంది ముస్లింలు ఉన్నారు.

Hindus in Pakistan: పాకిస్థాన్‌లో ఎన్ని లక్షల మంది హిందువులు నివసిస్తున్నారో తేల్చిన ఎన్ఏడీఆర్ఏ నివేదిక

Nadra Data

Hindus in Pakistan: పాకిస్థాన్ అంటే ముస్లింల దేశం అని అందరికీ తెలిసిందే. ఈ దేశంలోనూ ముస్లీమేతర ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అయితే వారి సంఖ్య కొద్దిమొత్తంలోనే ఉంటుంది. తాజాగా నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ (NADRA) నివేదిక ఆధారంగా.. ఈ ఏడాది మార్చి వరకు పాకిస్థాన్ లో మొత్తం జనాభా 18,68,90,601 ఉండగా.. వీరిలో 18,25,92,000 మంది ముస్లింలు ఉన్నారు. మిగిలిన వారు మైనార్టీలు. దేశంలోని మొత్తం జనాభాలో మైనార్టీలు ఐదు శాతం కంటే తక్కువగా ఉండగా, వారిలో 1.18 శాతం మాత్రమే హిందువులు జీవనం సాగిస్తున్నారు. ఆ దేశంలో నివసిస్తున్న మైనార్టీల్లో హిందువులు అతిపెద్ద మైనార్టీ కమ్యూనిటీగా ఉంది. NADRA నుండి కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ (CNIC) పొందిన మైనారిటీల ఆధారంగా డేటాను సేకరించిన నివేదిక ప్రకారం.. 1,400 మంది నాస్తికులు సహా వివిధ విశ్వాసాలు, మతాలకు చెందిన 17రకాల మైనార్టీలు పాకిస్థాన్ లో ఉన్నట్లు గుర్తించారు.

Pakistan: పాక్‎‎లో పెళ్లిళ్ల‎పై నిషేధం..!

పాకిస్థాన్ జనాభా మొత్తంలో ఐదు శాతం కంటే తక్కువగా మైనార్టీలు ఉన్నారు. వీరిలో హిందువులు 22,10,566 మంది, క్రైస్తవులు 18,73,348, అహ్మదీయులు 1,88,340, సిక్కులు 74,130, భాయిలు 14,537, పార్సీలు 3,917 మంది ఉన్నట్లు ఆ దేశంలో జరిగిన మూడు జాతీయ జనాభా గణనల ఆధారంగా నివేదిక పేర్కొంది. అయితే వీరితో పాటు పాకిస్తాన్‌లో మరో 11 మంది మైనారిటీ వర్గాలకు చెందిన వారు 2,000 కంటే తక్కువ మంది ఉన్నారు. వీరికి NADRA ద్వారా CNICలు జారీ చేయబడ్డాయి. అదేవిధంగా బౌద్ధులు 1,787 మంది, చైనీస్ 1,151, షింటోయిజం చెందిన వారు 628, యూదులు 628, ఆఫ్రికన్ మతాల అనుచరులు 1,418, కెలాషా మతం అనుచరులు 1,522, జైనమతం యొక్క ఆరుగురు ఉన్నారు.

Pakistan: ఇమ్రాన్ ఖాన్ హ‌త్య‌కు కుట్ర ప‌న్నారంటూ వదంతులు.. ఇస్లామాబాద్‌లో హై అల‌ర్ట్

పాకిస్థాన్ లో మైనార్టీలపై వేదింపులు ఎక్కువే. అహ్మదీస్ నుండి క్రైస్తవుల నుండి హిందువుల వరకు పాకిస్తాన్‌లోని మైనారిటీలు వేధింపులను ఎదుర్కొంటున్నారు. రెండు శాతం కంటే తక్కువ హిందువులు వేదింపులు ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు. అయితే వారిలో 95శాతం మంది దక్షిణ ప్రావిన్స్ సింధ్‌లో నివసిస్తున్నారు. పాకిస్తాన్‌లో హిందూ జనాభాతో సహా మైనారిటీలు దేశంలోని శాసన వ్యవస్థలో చాలా తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. పాకిస్తాన్ యొక్క హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో స్థిరపడ్డారు. అక్కడ వారు ముస్లిం నివాసులతో సంస్కృతి, సంప్రదాయాలు, భాషను పంచుకుంటారు. తీవ్రవాదుల వేధింపులపై అక్కడి హిందువులు తరచూ ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.