Ludo Game Love: ‘లూడో గేమ్’ కలిపింది ఇద్దరిని.. భారతీయుడితో ప్రేమలో పడి దేశం దాటొచ్చిన పాక్ యువతి.. ఇద్దరూ అరెస్ట్

ఆన్‌లైన్ యుగంలో ఒకరితో ఒకరు ఈజీగా ప్రేమలో పడిపోతున్నారు. తాజాగా లూడో గేమ్ కారణంగా పాకిస్తాన్‌కు చెందిన ఒక యువతి భారతీయుడి ప్రేమలో పడింది. అతడి కోసం సరిహద్దు దాటి వచ్చింది. అయితే, ఇప్పుడు జైలు పాలైంది.

Ludo Game Love: ‘లూడో గేమ్’ కలిపింది ఇద్దరిని.. భారతీయుడితో ప్రేమలో పడి దేశం దాటొచ్చిన పాక్ యువతి.. ఇద్దరూ అరెస్ట్

Ludo Game Affair: ప్రేమకు హద్దులు లేవంటారు. ఏ దేశం వాళ్లు మరే దేశం వాళ్లతోనైనా ప్రేమలో పడొచ్చు. అందులోనూ ఆన్‌లైన్ యుగంలో ఒకరితో ఒకరు ఈజీగా ప్రేమలో పడిపోతున్నారు. తాజాగా లూడో గేమ్ కారణంగా పాకిస్తాన్‌కు చెందిన ఒక యువతి భారతీయుడి ప్రేమలో పడింది. అతడి కోసం సరిహద్దు దాటి వచ్చింది.

Karimnagar: కరీంనగర్‌లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి 11 రోజులపాటు వేడుకలు

అయితే, ఇప్పుడు జైలు పాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడుతూ పాకిస్తాన్‌కు చెందిన ఒక యువతి, ఉత్తర ప్రదేశ్‌లోని ఒక యువకుడు ప్రేమలో పడ్డారు. దీంతో ఆ యువతి ఎలాగైనా ఇండియాలో ఉన్న తన ప్రియుడ్ని కలుసుకోవాలి అనుకుంది. అయితే, ఇండియా రావడానికి ఆమె వద్ద సరైన డాక్యుమెంట్లు లేవు. దీంతో నేపాల్ వెళ్లి, అక్కడ్నుంచి ఇండియా చేరుకుంది. తర్వాత తన ప్రియుడిని కలుసుకుంది. అనంతరం ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారు. తర్వాత బెంగళూరులో కొంతకాలంగా కలిసే ఉంటున్నారు.

Elon Musk: ఫలించిన అభిమాని నిరీక్షణ.. ఫ్యాన్ బాయ్‌ను హగ్ చేసుకున్న ఎలన్ మస్క్

ఈ క్రమంలో పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. పాక్ యువతి సరైన పత్రాలు లేకుండా ఇండియాలో ఉంటోందని పోలీసులు గుర్తించారు. ఆమె నకిలీ పత్రాలతో దేశంలో అక్రమంగా ఉంటుందని తేల్చారు. దీంతో ఆమెపై పోలీసులు ఫోర్జరీ కేసు బుక్ చేశారు. తర్వాత ఇద్దరినీ అరెస్టు చేశారు. కేసుకు సంబంధించి ప్రస్తుతం ఇద్దరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.