Elon Musk: ఫలించిన అభిమాని నిరీక్షణ.. ఫ్యాన్ బాయ్‌ను హగ్ చేసుకున్న ఎలన్ మస్క్

ఎలన్ మస్క్‌ను కలుసుకుని, హగ్ చేసుకోవాలన్న అభిమాని కల తీరింది. ఫిడియాస్/ఫిఫి పనాయోటో అనే యూట్యూబర్ ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్‌కు పెద్ద అభిమాని. దీంతో ఫిడియాస్ ఎలాగైనా మస్క్‌ను కలవాలనుకున్నాడు. దీని కోసం చాలా ప్రయత్నించాడు.

Elon Musk: ఫలించిన అభిమాని నిరీక్షణ.. ఫ్యాన్ బాయ్‌ను హగ్ చేసుకున్న ఎలన్ మస్క్

Updated On : January 23, 2023 / 1:33 PM IST

Elon Musk: ఎట్టకేలకు ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ అభిమాని నిరీక్షణ ఫలించింది. ఎలన్ మస్క్‌ను కలుసుకుని, హగ్ చేసుకోవాలన్న అభిమాని కల తీరింది. ఫిడియాస్/ఫిఫి పనాయోటో అనే యూట్యూబర్ ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్‌కు పెద్ద అభిమాని. దీంతో ఫిడియాస్ ఎలాగైనా మస్క్‌ను కలవాలనుకున్నాడు.

Karimnagar: కరీంనగర్‌లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి 11 రోజులపాటు వేడుకలు

దీని కోసం చాలా ప్రయత్నించాడు. కుదరకపోవడంతో చివరకు ట్విట్టర్ ప్రధాన కార్యాలయం ఎదుట క్యాంప్ వేసుకుని ప్రయత్నించాడు. మస్క్‌ను కలిసి, హగ్ చేసుకునేంత వరకు అక్కడ్నుంచి వెళ్లబోనని చెప్పాడు. ఎలాగైనా ఆయన్ని కలవాలని ప్రయత్నించాడు. చాలా రోజులుగా అతడు మస్క్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తను రోజూ చేసే ప్రయత్నాల్ని, తన లైఫ్ స్టైల్‌ను యూట్యూబ్ ద్వారా ఫిడియాస్ వెల్లడించే వాడు. యూట్యూబ్ ద్వారా ఈ విషయం నెటిజన్లను చేరింది. దీంతో చాలా మంది సోషల్ మీడియా వేదికగా అతడ్ని కలవాలని ఎలన్ మస్క్‌కు సూచించారు. కానీ, మస్క్ దీన్ని పట్టించుకోలేదు. మరోవైపు ఫిడియాస్ తరఫున చాలా మంది మస్క్‌ను విమర్శించారు.

Parakram Diwas: అండమాన్ దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టనున్న మోదీ.. 21 దీవులకు 21 పేర్లు

ఈ విషయంలో మస్క్ తల్లి మేయెను కూడా నెటిజన్లు విమర్శించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కామెంట్ల ద్వారా అతడు మస్క్‌ను కలిసేలా చూడాలని కోరారు. కొందరు తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, ఎట్టకేలకు ఫిడియాన్ తాజాగా తన అభిమాన మస్క్‌ను కలుసుకున్నాడు. ఆనందంతో హగ్ చేసుకున్నాడు. మస్క్‌ను తాను హగ్ చేసుకున్న ఫొటోను ఫిడియాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. దీంతో ఇన్నాళ్ల అతడి నిరీక్షణకు తెరపడినట్లైంది. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.