Pakistan Cricket Board: తప్పును సరిదిద్దుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. కొత్త వీడియోలోకి ఇమ్రాన్.. తొలి వీడియోపై విచిత్రమైన వివరణ

ఆగస్టు 14న షేర్ చేసిన వీడియో స్థానంలో పీసీబీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో మరో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఇమ్రాన్ ఖాన్‌ను చేర్చింది.

Pakistan Cricket Board: తప్పును సరిదిద్దుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. కొత్త వీడియోలోకి ఇమ్రాన్.. తొలి వీడియోపై విచిత్రమైన వివరణ

Imran Khan

Imran Khan: పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్స‌వం ఆగ‌స్టు 14న అన్నసంగ‌తి తెలిసిందే. దేశ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆ దేశ క్రికెట్ గ‌తిని మార్చిన కొంద‌రు దిగ్గ‌జ ఆట‌గాళ్ల గురించి వివ‌రిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) వీడియో రూపొందించింది. అయితే.. ఆ వీడియోలో ఎక్క‌డా పాక్ మాజీ దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ గురించి ప్ర‌స్తావించ‌లేదు. దీంతో బోర్డు తీరుపై అభిమానులు మండిపడ్డారు. బోర్డు మాజీ ఛైర్మన్ ఖలీద్ మహమూద్‌, వసీం అక్రమ్‌తోపాటు పలువురు పాక్ దిగ్గజ క్రికెటర్లుసైతం దేశంలో ఆటకు ఇమ్రాన్‌ఖాన్ చేసిన సహకారాన్ని విస్మరించినందుకు వెంట‌నే పీసీబీ స‌ద‌రు వీడియోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Imran Khan

Imran Khan

Asia Cup : ఓ సారి టీ20, మ‌రోసారి వ‌న్డే ఫార్మాట్‌.. ఇలా ఎందుకంటే..?

ప్ర‌స్తుతం పాక్ దిగ్గ‌జ ఆట‌గాడు, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ‘తోషీఖానా’ కేసులో జైలు శిక్ష అనుభ‌విస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ను వీడియోలో చూపించ‌కుండా చేయ‌డం వెనుక ప్ర‌భుత్వ పెద్దల హ‌స్తం ఉంద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రాజ‌కీయాలు వేరు, క్రికెట్ వేర‌ని, రెండింటిని ముడిపెట్టి చూడ‌డం భావ్యం కాద‌ని ఇమ్రాన్ ఖాన్ అభిమానులు, పాక్ క్రికెట్ అభిమానులు కామెంట్లు చేశారు. దీనికితోడు పీసీబీ తీరును తప్పుబడుతూ.. చరిత్ర అనేది కేవలం ఒక్క రోజులోనే సృష్టించలేమ‌ని, దిగ్గజాలను విస్మరించేలా ఇలాంటి వీడియోలు చేయ‌డాన్ని తాము స‌హించేది లేదంటూ #ShameOnPCBతో ట్రోలింగ్ చేశారు. అన్ని వైపుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెనక్కు తగ్గింది. తన తప్పును సరిదిద్దుకుంది.

ODI World Cup 2023 : ప్ర‌పంచ‌క‌ప్ టికెల్ కావాలా.. ఇలా రిజిస్ట్రేష‌న్ చేసుకోండి

ఆగస్టు 14న షేర్ చేసిన వీడియో స్థానంలో పీసీబీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో మరో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఇమ్రాన్ ఖాన్‌ను చేర్చింది. అయితే, ఇమ్రాన్ ఖాన్ గత వీడియోలో కనిపించక పోవటానికి పీసీబీ విచిత్రమైన వివరణ ఇచ్చింది. పీసీబీ ఇచ్చిన వివరణ ప్రకారం.. డబ్ల్యూసీ2023కి ప్రచారాన్ని పీసీబీ ప్రారంభించింది. వీడియోలో ఒకటి 14 ఆగస్టు 2023న అప్‌లోడ్ చేయడం జరిగింది. దాని నిడివి కారణంగా కేవలం స్వల్ప వీడియోను మాత్రమే రిలీజ్ చేశాం. ముఖ్యమైన క్లిప్‌లు అందులో లేవు. ఇప్పుడు పూర్తి వెర్షన్‌తో కూడిన వీడియోను విడుదల చేస్తున్నాం’ అంటూ పీసీబీ పేర్కొంది. ఫలితంగా క్రికెట్ ప్రముఖులు, పాక్ క్రికెట్ అభిమానుల నుంచి వస్తున్న విమర్శలకు పీసీబీ విచిత్రమైన వివరణతో, ఇమ్రాన్ ప్రస్తావన లేకుండానే చెక్ పెట్టింది.