Pakistani aircraft-shaped balloon: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ విమాన ఆకార బెలూన్ లభ్యం
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సరిహద్దుల్లో పాకిస్థాన్ విమానం ఆకారపు బెలూన్ లభించడం కలకలం రేపింది. బెలూన్ పై పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ అంటూ లోగో రాసి ఉంది....

Pakistani aircraft-shaped balloon
Pakistani aircraft-shaped balloon:జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సరిహద్దుల్లో పాకిస్థాన్ విమానం ఆకారపు బెలూన్ లభించడం కలకలం రేపింది. బెలూన్ పై పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ అంటూ లోగో రాసి ఉంది. కథువా జిల్లా హీరానగర్‌లో నలుపు, తెలుపు రంగులో ఉండే మిస్టరీ బెలూన్ నేలపై పడి ఉంది.భద్రతా బలగాలు బెలూన్‌ను స్వాధీనం చేసుకుని, బెలూన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
Extremists attack beachside hotel: సోమాలియాలోని బీచ్‌సైడ్ హోటల్‌పై ఉగ్రవాదుల దాడి
తాజాగా జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడుఈ ఏడాది ఫిబ్రవరిలో విమానం ఆకారంలో ఉన్న ఆకుపచ్చ,తెలుపు బెలూన్ సిమ్లాలోని ఒక ఆపిల్ తోటలో కనిపించింది. ఆ బెలూన్ పై పాక్ విమాన సంస్థ చిహ్నం ముద్రించిఉంది. మే 20వతేదీన అమృత్‌సర్‌లో పాకిస్థానీ డ్రోన్‌ను కూల్చివేశారు. అనుమానాస్పద మత్తుపదార్థాలు ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళాల సిబ్బంది తెలిపారు.అంతకుముందు రోజు బీఎస్ఎఫ్ నాలుగు పాకిస్తాన్ డ్రోన్‌లను అడ్డగించింది.