PAN Aadhaar Link Last Date : పాన్-ఆధార్ లింక్ చివరి తేదీ ఇదిగో.. లింక్ చేయకపోతే ఏమౌతుంది? తప్పక తెలుసుకోండి..!

PAN Aadhaar Link Last Date : ఆదాయపు పన్ను శాఖ జూన్ 30 లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని సూచిస్తోంది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసేటప్పుడు, రెండు ID కార్డ్‌ల వివరాలు సరిపోలేలా అప్‌డేట్ చేయాలని సూచించింది.

PAN Aadhaar Link Last Date : పాన్-ఆధార్ లింక్ చివరి తేదీ ఇదిగో.. లింక్ చేయకపోతే ఏమౌతుంది? తప్పక తెలుసుకోండి..!

PAN-Aadhaar link last date nearing, here is what to do if linking fails

PAN-Aadhaar Link Last Date : పాన్ కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేయడానికి గడువు సమీపిస్తోంది. మొదటగా మార్చి 31, 2022కి గడువు తేదీని ప్రకటించగా.. ఆ తర్వాత గడువు జూన్ 30 వరకు పొడిగించింది. ఇంకా తమ కార్డ్‌లను లింక్ చేయని వ్యక్తులు రూ. 1000 పెనాల్టీని చెల్లించడం ద్వారా ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. అయితే, రెండు ఐడీ కార్డుల్లోని వివరాలు సరిపోలని కారణంగా తమ కార్డ్‌లను లింక్ చేయడంలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే నివాసితులకు ఆదాయపు పన్ను శాఖ రిమైండర్ జారీ చేసింది. ఆధార్, పాన్ కార్డ్‌లను విజయవంతంగా లింక్ చేయడానికి ప్రత్యేక విధానాన్ని అందించింది.

పాన్-ఆధార్‌ను లింక్ చేసేటప్పుడు చాలా మంది సమస్యలను ఎదుర్కొంటున్నారని ఐటీ శాఖ ఇటీవల ట్వీట్‌లో పేర్కొంది. ఎందుకంటే, ఆధార్‌తో పాన్‌ను లింక్ చేస్తున్నప్పుడు.. రెండు ఐడీ కార్డుల్లోని వివరాలు సరిపోలడం లేదు. దాంతో లింకింగ్ ప్రక్రియ పూర్తి కావడం లేదు. ప్రధానంగా కార్డుదారుడి పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు సరిపోలడం లేదు.

Read Also : Aadhaar Update : మీ ఆధార్ కార్డులోని వివరాలను QR కోడ్ స్కానింగ్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు తెలుసా?

ఆధార్, పాన్ కార్డును లింక్ చేయడానికి ముందుగానే ఆన్‌లైన్‌లో వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్, పాన్ సర్వీస్ ప్రొవైడర్‌లను సందర్శించడం ద్వారా తప్పులను సరిదిద్దుకోవచ్చని డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. పాన్ & ఆధార్‌ను లింక్ చేయడానికి, బయోమెట్రిక్ ఆధారిత అథెంటికేషన్ తప్పనిసరి. పాన్ సర్వీస్ ప్రొవైడర్ల (ప్రోటీన్ & UTIITSL) ప్రత్యేక కేంద్రాలలో పొందవచ్చు. ఇంతకీ, ఆధార్, పాన్ కార్డ్‌లలో వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఆధార్ కార్డ్ వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలంటే? :
సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ (SSUP)లో ఆన్‌లైన్‌లో ఆధార్‌లోని అడ్రస్ వివరాలను అప్‌డేట్ చేయవచ్చని UIDAI పేర్కొంది. (ssup.uidai.gov.in/ssup/)ని విజిట్ చేయండి. అప్‌డేట్ ఆధార్‌పై క్లిక్ చేసి, వివరాలను అప్‌డేట్ చేయండి. మీ ఆధార్‌లోని జనాభా వివరాలు (పేరు, చిరునామా, DoB, లింగం, మొబైల్ నంబర్, ఇమెయిల్) అలాగే బయోమెట్రిక్స్ (ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ & ఫొటోగ్రాఫ్) వంటి ఇతర అప్‌డేట్‌ల కోసం పర్మినెంట్ రిజిస్టర్ సెంటర్ విజిట్ చేయాలి.

PAN-Aadhaar link last date nearing, here is what to do if linking fails

PAN-Aadhaar link last date nearing, here is what to do if linking fails

పాన్ కార్డ్ వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలంటే? :
NSDL PAN వెబ్‌సైట్ (onlineservices.nsdl.com/) లేదా UTIITSL వెబ్‌సైట్ (pan.utiitsl.com/)ని విజిట్ చేయండి. పాన్ కార్డ్ వివరాలలో Change/Edit ఆప్షన్ ఎంచుకోండి.
మీ పాన్ కార్డ్ నంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేసి, ‘Submit’పై క్లిక్ చేయండి. ఫారమ్‌లో అవసరమైన వివరాలను నింపండి. సహాయక పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి. దరఖాస్తు రుసుము చెల్లించండి. ‘Submit’ పై క్లిక్ చేయండి.

పాన్-ఆధార్ లింక్ చేయడం ఎలా? :
వివరాలు అప్‌డేట్ చేసిన తర్వాత, మీరు (eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar)లో ఆధార్-పాన్ లింక్‌ని మళ్లీ ప్రయత్నించవచ్చు. ఐటి నిబంధనల ప్రకారం.. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139AA ప్రకారం.. ఒక వ్యక్తి తమ ఆధార్ నంబర్‌ను లింక్ చేయడంలో విఫలమైతే.. వారి పాన్ పనిచేయకుండా పోతుందని IT శాఖ హెచ్చరించింది. పన్ను చెల్లింపుదారులు తమ పాన్‌ని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించలేరు. రిటర్న్‌లను దాఖలు చేయడం, పెండింగ్‌లో ఉన్న రిటర్న్‌లను ప్రాసెస్ చేయడం, రీఫండ్‌లను జారీ చేయడం, పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్‌లను పూర్తి చేయడం లేదా సాధారణ రేటుతో పన్నులను తీసివేయడం వంటివి ఉంటాయి.

అంతేకాకుండా, ఆర్థిక లావాదేవీలకు PAN ముఖ్యమైన KYC అథెంటికేషన్ అవసరం. లేదంటే.. పన్ను చెల్లింపుదారు బ్యాంకులు ఇతర ఆర్థిక పోర్టల్‌లతో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాల్సిన అవసరం లేదు. వారిలో 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం నాన్-రెసిడెంట్స్ (భారతీయేతర పౌరులు) తమ పాన్ ఆధార్ లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

Read Also : Pan-Aadhaar Linking Deadline : పాన్-ఆధార్ లింక్ డెడ్‌లైన్ ఇదిగో.. ఈ తేదీలోగా లింక్ చేయలేదంటే.. ఏం జరుగుతుందో తెలుసా?