Telugu Directors: పాన్ ఇండియా టార్గెట్.. ఈ దర్శకులకు ఇప్పుడిదే బిగ్ చాలెంజ్

క్రియేటివ్ ఫీల్డ్ లో ఎప్పటికప్పుడు కొత్తదనం వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సక్సెసే మాట్లాడుతుంది. ఒక డైరెక్టర్ కి వరసగా రెండు సక్సెస్ లు వచ్చాయంటే రేంజ్ మారిపోతుంది. ఆ రేంజ్ రీచ్ అవ్వకపోతే అవకాశాలు కూడా చేజారిపోతుంటాయి..

Telugu Directors: పాన్ ఇండియా టార్గెట్.. ఈ దర్శకులకు ఇప్పుడిదే బిగ్ చాలెంజ్

Telugu Directors

Telugu Directors: క్రియేటివ్ ఫీల్డ్ లో ఎప్పటికప్పుడు కొత్తదనం వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సక్సెసే మాట్లాడుతుంది. ఒక డైరెక్టర్ కి వరసగా రెండు సక్సెస్ లు వచ్చాయంటే రేంజ్ మారిపోతుంది. ఆ రేంజ్ రీచ్ అవ్వకపోతే అవకాశాలు కూడా చేజారిపోతుంటాయి.. సక్సెస్ ఎఫెక్ట్ అలా ఉంటుంది. అయితే ఇప్పుడు కొంత మంది దర్శకులకు బిగ్ సక్సెసే బిగ్ ఛాలెంజ్ గా మారిపోయింది. ఆ దర్శకులెవరు? వాళ్లకు సక్సెస్ పరీక్ష పెట్టే సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Directors: కథే కీలకం.. ప్రభాస్ లాంటి స్టార్‌ను కూడా పట్టేస్తున్న యంగ్ డైరెక్టర్‌లు!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్తాయి మార్కెట్ ను షేక్ చేయొచ్చని ప్రూవ్ చేశారు. రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ తోనూ ఆ లెగసీ కంటిన్యూ చేశారు. కానీ, తన 2000 కోట్ల టార్గెట్ ను రీచ్ కాలేక పోయారు. దాంతో ఇప్పుడు రాజమౌళి బిగ్ టార్గెట్ మహేశ్ బాబుతో చేయబోతున్న సినిమాకు షిఫ్ట్ చేశారు. ఆ రేంజ్ కి తగ్గకుండా మరింత మార్కెట్ స్పాన్ పెంచాలని, ఇప్పిటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. సో మహేశ్ తో రాజమౌళి చేసే సినిమా ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్ధలు కొడుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అదే బిగ్ చాలెంజ్ గా తీసుకున్నారు జక్కన్న.

Telugu Directors: హిట్టు కొట్టినా కొత్త సినిమా పట్టాలెక్కించలేని దర్శకులు!

వరస విజయాలతో తనకంటూ సపరేట్ ఇమేజ్ సెట్ చేసుకున్న దర్శకుడు కొరటాల శివ. ఆయన తన సినిమాల్లో హీరో ఎలివేషన్స్ కన్నా ఎమోషన్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆచార్య విషయంలో తన మార్క్ వర్కవుట్ కాలేదనే చెప్పాలి. ఆచార్య సక్సెస్ ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి రీచ్ కాలేకపోయింది. దాంతో ఆయన నెక్స్ట్ ఎన్టీఆర్ తో చేస్తున్న ప్రాజెక్ట్ తో బిగ్ సక్సెస్ కొట్టి, తిరిగి తన స్టామినాను ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యయేషన్ క్రియేట్ అయ్యింది. ఆల్రెడీ వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బిగ్ సక్సెస్ అయ్యింది. ఎన్టీఆర్ కు ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ ఏర్పడింది. సో ఇప్పుడు కొరటాల చేయబోయే సినిమా పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ చేయాలన్న ఛాలెంజ్ తో చేస్తున్నారు.

Telugu Young Directors: స్టార్ హీరోలను ఫిదా చేస్తున్న యంగ్ డైరెక్టర్స్..!

నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తర్వాత శివ నిర్వాణ, విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నారు. లైగర్ తో పాన్ ఇండియా రేంజ్ సినిమా చేసిన విజయ్ ని శివ నిర్వాణ ఎలా ఢీల్ చేయబోతున్నారు. ఫాన్స్ ను ఎలా సాటిస్ ఫై చేస్తారనేది బిగ్ చాలెంజ్ గా మారింది. ఇక జెర్సీతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి, రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న చరణ్, నార్త్ లో జెర్సీతో హిట్ కొట్టలేకపోయిన గౌతమ్ తో పాన్ ఇండియా సినిమా చేయడంతో ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ చేయడంపైనే గౌతమ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లు ఉంటాయి. సో గౌతమ్ తిన్ననూరి కిది బిగ్ ఛాలెంజే అంటున్నారు సినీ విశ్లేషకులు.