#PVT04 : భయంకరమైన ప్రయాణం అంటూ.. సమ్మర్ బరిలో పంజా వైష్ణవ్ తేజ్..
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా పంజా వైష్ణవ తేజ్ నాలుగో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. టైటిల్ ప్రకటించని ఈ సినిమాకి #PVT04 పేరుతో తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ పై A journey of the fierce one అనే కొటేషన్ ఇచ్చి..............................

Panja Vaishnav Tej 4th movie will releasing in Summar
#PVT04 : మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతోనే 100 కోట్లు సాధించి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ లోకి. దీంతో వైష్ణవ్ పై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రెండో సినిమా కొండపొలంతో దారుణంగా నిరాశపరిచాడు. ఈ సినిమా భారీ పరాజయం పొందింది. ఇక మూడో సినిమాగా రంగరంగ వైభవంగా అంటూ వచ్చి పర్వాలేదనిపించాడు. వచ్చిన మూడు సినిమాలు కూడా మూడు జోనర్స్ తో వచ్చి కొత్తగా ట్రై చేశాడు అనిపించుకున్నాడు.
2022 జూన్ లోనే వైష్ణవ్ తేజ్ తన నాలుగో సినిమాని అనౌన్స్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి. శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో వైష్ణవ తేజ్ సరసన శ్రీలీల నటిస్తుంది. ఇదివరకు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ తోనే ఈ సినిమా ఫుల్ మాస్ గా ఉండబోతుందని అంచనా వేసుకున్నారు ప్రేక్షకులు. గతంలో 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రకటించినా ఈ సినిమా వాయిదా పడక తప్పలేదు.
Sr. NTR : అభిమానుల కోసం.. ఉచితంగా సీనియర్ ఎన్టీఆర్ డివోషినల్ సినిమాల ప్రదర్శన..
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా పంజా వైష్ణవ తేజ్ నాలుగో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. టైటిల్ ప్రకటించని ఈ సినిమాకి #PVT04 పేరుతో తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ పై A journey of the fierce one అనే కొటేషన్ ఇచ్చి 2023 ఏప్రిల్ 29న థియేటర్స్ లో రిలీజ్ కానుంది అని ప్రకటించారు. దీంతో సమ్మర్ బరిలో ఈ సారి వైష్ణవ్ కూడా దిగాడు. మరి ఇప్పటిదాకా లవ్ జోనర్స్ రిలేటెడ్ ఉన్న సినిమాలతో మెప్పించిన వైష్ణవ్ ఈ సారి ఫుల్ మాస్ సినిమాతో రాబోతున్నట్టు తెలుస్తుంది. సమ్మర్ లో ఈ మాస్ సినిమాతో ఏ రేంజ్ వేడిని పెంచుతాడో వైష్ణవ్ చూడాలి.
అయితే వైష్ణవ్ అన్న సాయి ధరమ్ తేజ్ కూడా తన నెక్స్ట్ సినిమా విరూపాక్ష ని సమ్మర్ లోనే రిలీజ్ చేస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా 2023 ఏప్రిల్ 21 న రిలీజ్ కాబోతుంది. వారం గ్యాప్ లోనే తమ్ముడి సినిమా రిలీజ్ అవ్వనుంది. ఈ సారి అన్నదమ్ముల మధ్య పోటీ ఉండబోతుంది అని భావిస్తున్నారు.
A journey of the fierce one, #PVT04 in theatres from this 29 April 2023! ?#PanjaVaisshnavTej in the all new massy pulsating action avatar like never before! ?@sreeleela14 #SrikanthNReddy @vamsi84 #Dudley #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/P4zSvjmRwW
— Sithara Entertainments (@SitharaEnts) January 2, 2023