Sr. NTR : అభిమానుల కోసం.. ఉచితంగా సీనియర్ ఎన్టీఆర్ డివోషినల్ సినిమాల ప్రదర్శన..

ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఇప్పటికే నిర్వహించిన పలు కార్యక్రమాలకి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా విచ్చేశారు. తాజాగా ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ నటించిన డివోషినల్ సినిమాలలోని కొన్ని సినిమాలని ఉచితంగా ప్రదర్శించనున్నారు..................

Sr. NTR : అభిమానుల కోసం.. ఉచితంగా సీనియర్ ఎన్టీఆర్ డివోషినల్ సినిమాల ప్రదర్శన..

Sr. NTR movies free screening in Tenali

Sr. NTR :  సినిమాలతో, రాజకీయాలతో తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు నందమూరి తారకరామారావు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు కొన్ని రోజులుగా జరుపుతున్నారు ఆయన అభిమానులు. ఈ ఉత్సవాలలో భాగంగా అనేక కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లోని అయన అభిమానులు, అభిమాన సంఘాలు, పలువురు నాయకులు నిర్వహిస్తున్నారు.

ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఇప్పటికే నిర్వహించిన పలు కార్యక్రమాలకి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా విచ్చేశారు. తాజాగా ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ నటించిన డివోషినల్ సినిమాలలోని కొన్ని సినిమాలని ఉచితంగా ప్రదర్శించనున్నారు. తెనాలి రామకృష్ణ థియేటర్ వాళ్ళు జనవరి 2 నుంచి జనవరి 6 వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకి సీనియర్ ఎన్టీఆర్ సినిమాలని ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఎవరైనా వెళ్లి ఈ సినిమాలని చూడొచ్చు.

James Camaron : ‘అవతార్ 2’లో పది నిమిషాల సీన్స్ కట్ చేసిన జేమ్స్ కామెరూన్..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2న ఎన్టీఆర్ వెంకటేశ్వరస్వామిగా నటించిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాని ప్రదర్శిస్తున్నారు. మూడో తేదీన శ్రీమద్విరాట పర్వం, నాలుగో తేదీన శ్రీ కృష్ణ సత్య, ఐదో తేదీన బ్రహ్మర్షి విశ్వామిత్ర, ఆరో తేదీన తాతమ్మ కల సినిమాలని ప్రదర్శించనున్నారు. దీంతో తెనాలి, తెనాలి చుట్టుపక్క గ్రామాల్లోని ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాలని చూడటానికి రామకృష్ణ థియేటర్ కి వెళ్లనున్నారు.