Parliament Sessions : నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. ఉదయం లోక్‌సభలో నలుగురు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సంగ్రూర్ (పంజాబ్), రాంపూర్, ఆజంగఢ్ (యూపీ), అసన్‌సోల్ (బెంగాల్) నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో నలుగురు ఎంపీలు గెలుపొందారు.

Parliament
Parliament Sessions : నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. ఉదయం లోక్‌సభలో నలుగురు కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సంగ్రూర్ (పంజాబ్), రాంపూర్, ఆజంగఢ్ (యూపీ), అసన్‌సోల్ (బెంగాల్) నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో నలుగురు ఎంపీలు గెలుపొందారు.
ఉప ఎన్నికల్లో గెలుపొందిన వారిలో సిమ్రన్‌జీత్ సింగ్ మాన్ (సంగ్రూర్), ఘన్‌శ్యామ్ సింగ్ లోధి (రాంపూర్), దినేశ్ లాల్ యాదవ్ (ఆజాంగఢ్), శతృఘన్ ప్రసాద్ సిన్హా (అసన్‌సోల్) ఉన్నారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, అబుదాబీ అధినేత షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ సహా పలువురు మాజీ ఎంపీల మృతికి లోక్‌సభ సంతాపం ప్రకటించనుంది.
President Polls: భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక నేడే, ఒక్కో ఓటు విలువ 700
అనంతరం కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ది ఫ్యామిలీ కోర్ట్స్ (సవరణ) బిల్లు-2022ను ప్రవేశపెట్టనున్నారు. ది ఇండియన్ అంటార్కిటిక్ బిల్-2022పై చర్చించి, సభ ఆమోదం కోసం కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టనున్నారు. నేడు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు సహా కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇటీవల మరణించిన దేశాధినేతలు సహా మాజీ సభ్యుల మృతిపై సభ సంతాపం తెలపనుంది. అసాంఘీక కార్యాకలాపాల నిరోధక చట్టం (సవరణ) – ది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ దెయిర్ డెలివరీ సిస్టమ్స్ బిల్ 2022ను చర్చ, ఆమోదం కోసం కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్ ప్రవేశపెట్టనున్నారు.