Pawan Kalyan : నేను విగ్రహారాధన చేయను.. కానీ.. చరణ్ 200 రోజులు మాలలోనే ఉంటాడు..
మొదటి ఎపిసోడ్ లో పవన్ ఫ్యామిలీ, సినిమాలు గురించి మాట్లాడారు. ఇక రెండో ఎపిసోడ్ లో రాజకీయాలు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. బాలయ్య - పవన్ ఎపిసోడ్ లో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు.............

Pawan Kalyan shares about his devotional opinion in Unstoppable show
Pawan Kalyan : బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీ లో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెకండ్ సీజన్ మరింత పాపులార్ అయింది. ఇక సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షో దేశవ్యాప్తంగా మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఈ ఎపిసోడ్ తో సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ షో. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ షూటింగ్ మొదలయిన దగ్గర్నుంచి బాలయ్య, పవన్ అభిమానులు హంగామా చేస్తూనే ఉన్నారు. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఆహా ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటల నుండి స్ట్రీమింగ్ చేశారు.
పవన్ అభిమానులు, అటు బాలకృష్ణ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. రిలీజయిన కొద్దిసేపటికే చాలామంది చూసి సరికొత్త రికార్డులని సెట్ చేశారు. కొన్ని చోట్ల అభిమానులు ఈ షోని స్పెషల్ ప్రివ్యూ వేశారు. అయితే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ మొదటి ఎపిసోడ్ లో పవన్ ఫ్యామిలీ, సినిమాలు గురించి మాట్లాడారు. ఇక రెండో ఎపిసోడ్ లో రాజకీయాలు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. బాలయ్య – పవన్ ఎపిసోడ్ లో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ ని ఎక్కువగా పూజలు, ధ్యానం చేస్తావు కదా, నీకు భక్తి ఎక్కువ కదా అని బాలకృష్ణ అడిగాడు. పవన్ కళ్యాణ్ దీనికి సమాధానమిస్తూ.. ఒకప్పుడు నేను విగ్రహారాధన చేసేవాడ్ని కాదు. ధ్యానం, యోగా లాంటివి చేసేవాడ్ని. దేవుడ్ని నమ్ముతాను కానీ దీపం పెట్టుకొని ధ్యానం చేసేవాడ్ని. ఒక గురువు కలిసి నన్ను గమనించి చెప్పి విగ్రహారాధన చేయమన్నారు. అలా దుర్గాదేవిని ప్రార్ధించడం మొదలుపెట్టాను. అలా అందర్నీ పూజిస్తాను అంతేకాని పూజలు.. ఇలా మరీ ఎక్కువగా ఉండవు అని అన్నాడు.
చరణ్ కి ఎక్కువ భక్తి కదా అని బాలకృష్ణ అడగగా.. చరణ్ కి భక్తి ఎక్కువే. సంవత్సరంలో 200 రోజులు ఏదో ఒక మాలలోనే ఉంటాడు. నా దగ్గర్నుంచి అది నేర్చుకోలేదు. వాడి స్వతహాగా నేర్చుకున్నాడు అది అని చెప్పాడు. దీంతో చరణ్ – పవన్ అనుబంధం గురించి కూడా అడిగాడు బాలయ్య.