Romantic Movie : ఎవడైతే నాకేంటంటా ‘లకిడికపూల్’
‘ఎవడైతే నాకేంటంటా లకిడికపూల్.. పెట్టేది నాకెవడంటా చెవిలోన పూల్’.. అంటూ లిరిక్స్‌లోనూ పూరి తన మార్క్ చూపించారు..

Romantic Movie
Romantic Movie: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న మూడో సినిమా ‘రొమాంటిక్’.. కేతికా శర్మ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అవుతోంది. అనిల్ పాదూరి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. శ్రీమతి లావణ్య సమర్పణలో, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్‌పై, పూరి జగన్నాథ్, ఛార్మీ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Mahesh Koneru : ఎన్టీఆర్ – అట్లీ సినిమా మహేష్ కోనేరు డ్రీమ్ ప్రాజెక్ట్.. అంతలోనే
ఈ మూవీకి పూరి జగన్నాథ్ స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శివగామి రమ్యకృష్ణ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా పూరి సంగీత్ ద్వారా ఈ సినిమాలోని ‘పీనే కే బాద్’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. సునీల్ కశ్యప్ సంగీతమందించి, చాలా చక్కగా పాడారు.. పూరి, భాస్కరబట్ల లిరిక్స్ రాశారు.. తాగిన తర్వాత జరిగే పరిణామాలతో రూపొందించిన ఈ సాంగ్ వినసొంపుగా ఉంది. ముఖ్యంగా యూత్‌ని అలరించేలా ఉండడంతో నెట్టింట వైరల్ అవుతోంది.
Srikanth Son Roshan : మహేష్ మాత్రం ఏం మారలేదు
లిరిక్స్‌లోనూ పూరి తన మార్క్ చూపించారు. ‘ఎవడైతే నాకేంటంటా లకిడికపూల్.. పెట్టేది నాకెవడంటా చెవిలోన పూల్.. కెలికేది నన్నెవడంటా కిరికెట్‌కి బాల్.. పీకేది నన్నెవడంటా పూరా నిఖాల్.. దబిడి దిబిడో, ఎవడికెవడో పీనే కే బాద్’.. అంటూ ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. దీపావళి కానుకగా నవంబర్ 4న ‘రొమాంటిక్’ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.