హైదరాబాద్‌లో మెస్సీ సందడి.. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్న ఫుట్‌బాల్ దిగ్గజం
ఫలక్‌నుమా ప్యాలెస్ వద్దే అతడిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. .
Lionel Messi
Lionel Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నాడు. ఇవాళ సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మెస్సీకి ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి అతడు ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్నాడు.
అక్కడే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నారు. మెస్సీ-రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Also Read: మెస్సీ తొందరగా వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ రచ్చ.. ఫొటోలు ఇవిగో..
‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా ఇవాళ మెస్సీ రాత్రి 7.50 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి 8.06 గంటలకు దాదాపు 5 నిమిషాల పాటు సీఎం రేవంత్‌రెడ్డి, మెస్సీ మైదానంలోకి వచ్చి మ్యాచ్ ఆడతారు. రాత్రి 8.08 గంటలకు రోడ్రిగో, లూయిస్ సువారెజ్ స్టేడియంలోకి వస్తారు. రాత్రి 8.13 గంటలకు పెనాల్టీ షూటౌట్ ఉంటుంది. రాత్రి 8.18 గంటలకు మైదానంలోకి రాహుల్ గాంధీ వస్తారు.
