bjp: కేసీఆర్ పాలన పోయి, బీజేపీ పాలన రావడం ఖాయమైంది: జేపీ న‌డ్డా

తెలంగాణ‌లోని సీఎం కేసీీఆర్ ప్ర‌భుత్వ పాల‌న‌లో జ‌రుగుతోన్న అవినీతి గురించి ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నార‌ని బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ ఏటీఎంలా మార్చుకున్నారని ఆయ‌న ఆరోపించారు.

bjp: కేసీఆర్ పాలన పోయి, బీజేపీ పాలన రావడం ఖాయమైంది: జేపీ న‌డ్డా

bjp: తెలంగాణ‌లోని సీఎం కేసీీఆర్ ప్ర‌భుత్వ పాల‌న‌లో జ‌రుగుతోన్న అవినీతి గురించి ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నార‌ని బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ ఏటీఎంలా మార్చుకున్నారని ఆయ‌న ఆరోపించారు. ప‌రేడ్ గ్రౌండ్‌లో ఇవాళ బీజేపీ నిర్వ‌హించిన స‌భ‌లో న‌డ్డా మాట్లాడుతూ.. తెలంగాణ‌లో జ‌రిగిన ప‌లు ఎన్నిక‌ల వేళ బీజేపీ మంచి ఫ‌లితాలు రాబ‌ట్టింద‌ని చెప్పారు.

Maharashtra: న‌న్ను సీఎంను చేసి మోదీ, షా అంద‌రి క‌ళ్ళూ తెరిపించారు: ఏక్‌నాథ్ షిండే

ప్ర‌జ‌లు త‌మ‌పై బాధ్య‌త‌ను పెంచార‌ని జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ ఇప్పుడు రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణలోనూ త‌మ‌ డబుల్ ఇంజన్ సర్కారు రావాలని జేపీ న‌డ్డా అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పోయి, బీజేపీ పాలన రావడం ఖాయమైంద‌ని చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ పార్టీని ఇక్క‌డ‌ అధికారంలోకి తీసుకురావాల‌ని అనుకుంటున్నార‌ని ఆయ‌న అన్నారు.