Old Mobiles: విచిత్ర పరిణామం.. 5జీ వైపు పరుగులు పెడుతుంటే.. పాత తరం ఫోన్‌లకు పెరిగిన గిరాకీ.. సోషల్ మీడియానే కారణమా?

టెక్నాలజీలో ప్రపంచం వేగంగా పరుగుతీస్తోంది. అధికశాతం మంది దూసుకెళ్తున్న టెక్నాజీని అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా టెలికం రంగంలో 5జీ సేవలుసైతం అందుబాటులోకి రానున్నాయి. ఇలాంటి తరుణంలో తొలితరం ఫోన్లకుసైతం గిరాకీ పెరుగుతుండటం ఆశ్చర్యాన్ని గిలిగిస్తోంది.

Old Mobiles: విచిత్ర పరిణామం.. 5జీ వైపు పరుగులు పెడుతుంటే.. పాత తరం ఫోన్‌లకు పెరిగిన గిరాకీ.. సోషల్ మీడియానే కారణమా?

First generation phones

Old Mobiles: టెక్నాలజీలో ప్రపంచం వేగంగా  పరుగుతీస్తోంది. అధికశాతం మంది దూసుకెళ్తున్న టెక్నాజీని అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా టెలికం రంగంలో టెక్నాలజీ పరుగులు పెడుతోంది. మరికొద్ది రోజుల్లో దేశంలో 5జీ సేవలుసైతం అందుబాటులోకి రానున్నాయి. మొబైల్స్ కంపెనీలు 5జీ ఫోన్ లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు ప్రపంచ మంతా వేగంగా విస్తరించింది. 83శాతం మందికిపైగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు.ఇంతస్థాయిలో స్మార్ట్ ఫోన్ హవా కొనసాగుతున్న తరుణంలో విచిత్ర పరిణామం చోటు చేసుకుంటోంది. స్మార్ట్ ఫోన్ లకు బదులు అనేక మంది పాతతరం బేసిక్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. గత రెండుమూడేళ్లుగా ఈ బేసిక్ ఫోన్ల విక్రయాలు జోరందకోవడమే ఇందుకు ఉదాహరణ.

Lumpy Skin Disease: ఆ తొమ్మిది రాష్ట్రాల నుంచి పశు రవాణా నిషేధం.. వచ్చినా.. వారంరోజులు క్వారంటైన్‌లోనే..!

తొలితరం సెల్ ఫోన్లు ( బేసిక్ ఫోన్, డంబ్ ఫోన్, ఫీచర్ ఫోన్, బ్రిక్ ఫోన్) అమ్మకాలు ఇటీవలి కాలంలో 100 కోట్ల మార్కుకు చేరుకున్నాయి. ఈ ఫోన్లు చిన్న స్క్రీన్ తో పాటు స్నేక్ గేమ్, క్వెర్టీ కీబోర్డు, మెస్సేజ్ లు చేసుకొనే అవకాశం, ఫోన్లు మాట్లాడుకునే అవకాశం మాత్రమే ఈ ఫోన్లలో ఉంటుంది. ఇలాంటి డంబ్ ఫోన్ల కోసం 2018 నుంచి 2021 మధ్య కాలంలో గూగుల్ లో సెర్చ్ 89శాతం పెరిగింది. గతేడాది స్మార్ట్ ఫోన్ల విక్రయం 140 కోట్లు ఉండగా బేసిక్ ఫోన్ల అమ్మకం దాదాపు అదే స్థాయిలో అంటే 100 కోట్లకు చేరిందని సాప్ట్ వేర్ కంపెనీ సెమ్ రస్ నివేదిక తెలిపింది. బ్రిటన్ లో ప్రతి పదిమందిలో ఒకరి వద్ద డంబ్ ఫోన్ ఉందని డెలాయిట్ చెబుతోంది.

Best 5G Smartphones 2022 : భారత్‌కు 5G వస్తోంది.. రూ.20వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఏ బ్రాండ్ ఫోన్ కొంటే బెటర్ అంటే?

పాతతరం ఫోన్లకు ఇంతలా గిరాకీ పెరగానికి ప్రధాన కారణం సోషల్ మీడియానే అన్న వాదన వినిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావటంతో పాటు 4జీ నెట్ సేవలు, మరికొన్నిరోజుల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైంది. పోన్ ద్వారానే సమస్త సమాచారం తెలిసిపోతుంది. ఆన్ లైన్ గేమ్స్ దగ్గర నుంచి షేర్ మార్కెట్ల వివరాల వరకు ఇలా ప్రతీది స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే తెలిసిపోతుంది. స్మార్ట్ ఫోన్ రావటం వల్ల నలుగురితో మాట్లాడటం మనేసి నిత్యం సోషల్ మీడియాలోనే బతికేస్తున్నామని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన టెక్నాలజీ నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికశాతం మంది సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతుండటంతో ఇది గ్రహించి చాలా మంది పాత డంబ్ ఫోన్ లు కొనుగోలు చేస్తున్నారని ఓ సర్వే తెలిపింది. ఇదిలాఉంటే భారత్ లో ఈ డంబ్ ఫోన్లను వాడుతున్న వారు 32కోట్ల మంది ఉన్నారట. దీంతో ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) బేసిక్ పోన్ల ద్వారా కూడా ఆన్ లైన్ చెల్లింపులకు వీలు కల్పించే ప్రోగ్రాంలను రూపొందించింది.