Lumpy Skin Disease: ఆ తొమ్మిది రాష్ట్రాల నుంచి పశు రవాణా నిషేధం.. వచ్చినా.. వారంరోజులు క్వారంటైన్‌లోనే..!

దేశవ్యాప్తంగా పశువులకు లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్‌డీ) వ్యాప్తి వేగంగా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఈ వైరస్ భారినపడి పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే 27వేల పశువులు మరణించగా వేలాది పశువులకు ఈ వ్యాధి వ్యాపించింది.

Lumpy Skin Disease: ఆ తొమ్మిది రాష్ట్రాల నుంచి పశు రవాణా నిషేధం.. వచ్చినా.. వారంరోజులు క్వారంటైన్‌లోనే..!

Lumpy skin disease

Lumpy Skin Disease: దేశవ్యాప్తంగా పశువులకు లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్‌డీ) వ్యాప్తి వేగంగా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఈ వైరస్ భారినపడి పశువులు మృత్యువాత పడుతున్నాయి. తెలంగాణలో ఈ వ్యాధి ఆనవాళ్లు ఇప్పటి వరకు కనిపించలేదు. దీంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది రాష్ట్రాల నుంచి పశువుల రవాణాను అడ్డుకోవాలని, సరిహద్దుల్లోనే వాటిని అడ్డుకొని అక్కడే 15 రోజులు క్వారంటైన్ లో ఉంచాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Lumpy Disease..killed 14,000 Cattle : ‘లంపీ’ చర్మవ్యాధితో‌ .. రాజస్థాన్‌లోనే 14,000 ఆవులు మృతి

దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ వ్యాధి సోకి 27వేల పశువులు మరణించాయి. ఇంకావేగంగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రాల మధ్య పశు రవాణాపై దృష్టి పెట్టాలని కేంద్రం హెచ్చరించింది. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, హరియాణ, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు పశురవాణాపై తాత్కాలికంగా నిషేధం విధించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి రవాణా చేసే పశువులను సరిహద్దుల్లోనే అడ్డుకొని, క్వారంటైన్ లో ఉంచాలని అధికారులకు సూచనలు జారీ చేసింది.

Lumpy Skin Disease: గుజరాత్‭లో 1500 గోవులు మృతి

లంపీస్కిన్ వ్యాధి సోకిన పశువులకు చర్మంపై పెద్ద పెద్ద కురుపులు, దద్దుర్లు వస్తాయి. వీటిపై వాలే దోమలు, ఈగలు అక్కడి నుంచి వైరస్ ను ఇతర పశువులకు వ్యాపింపజేస్తున్నాయి. పశువు శరీర లోపలి భాగాలకు వ్యాధి విస్తరించి క్రమంగా పశువులు మృత్యువాత పడుతున్నాయి.