Donda Sagu : దొండ సాగులో తెగుళ్ళు…నివారణ

ఇది దొండపంట తొలి దశలో ఉన్నప్పుడే ఆశిస్తుంది. దీని నివారణ కోసం 5 శాతం వేప కషాయాన్ని తయారు చేసుకుని పంట తోలి దశలో ఉన్నప్పుడే పిచికారీ చేయాలి.

Donda Sagu : దొండ సాగులో తెగుళ్ళు…నివారణ

Donda Sagu

Donda Sagu : కూరగాయల సాగులో దొండసాగుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దొండలో విటమిన్‌ బి1, విటమిన్‌-బి, అలాగే పోషకాలైన ఐరన్‌, కాలియంతో పాటు పీచు పదార్థాలు కూడా లభిస్తాయి. అందుకే ఎంతో మంది దొండను ఇష్ట ఇష్టపడతారు. రైతులకు ఈ పంట లాభదాయకంగా ఉంటుంది. అయితే దాని సస్యరక్షణకు సరైన పద్దతులు పాటిస్తే దొండసాగులో రైతులు లాభాలు పొందవచ్చు. దొండను సాగు చేసే రైతులు దాని కాండం ముక్కలను తమపొలంలో ఒక్కసారి నాటుకుని దానికి పందిరి వేయాలి. ఇలా సాగు చేయడం వలన మూడు ఏండ్లవరకు పంట దిగుబడిని అధికంగా పొందవచ్చు. దొండ సాగులో అధిక దిగుబడులు సాధించుటకు మంచి పంట యాజమాన్య పద్ధతులు పాటించాలి. మొక్క విత్తుట మొదలు పంట కోసే వరకు జాగ్రత్తలు పాటించాలి.

దొండను సాగులో తెగుళ్లు..యాజమాన్యం; దొండను తెగుళ్ళు, పురుగులు ఆశిస్తుంటాయి. వాటికి సరైన సమయంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే పంటకు నష్టం కలుగుతుంది. దిగుబడి తగ్గిపోతుంది. దొండను ఆశించే పురుగుల్లో ముఖ్యంగా చెప్పుకోవలసినవి..

పండు ఈగ ; దొండసాగులో పంట పూత దశకు రాగానే తల్లి ఈగలు పువ్వులపై గుడ్లను పెడుతుంటాయి. ఆ తర్వాత పూత, పిందెలలోకి చేరుతాయి. దాంతో కాయలను తిని పంటకు ఎంతో నష్టాన్ని కలుగజేస్తాయి. దీని నివారణకు పూత, పిందె దశలలో కొన్ని చర్యలు తీసుకోవాలి. అందులో ముందుగా మలాథియాన్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు దొండ తీగలపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 100 మి.లీ. మలాథియాన్‌ కు 100 గ్రా. చక్కెర లేదా బెల్లం పాకం లీటరు నీటిలో కలిపి ఉంటుచోవాలి. దాన్ని మట్టి పాత్రల్లో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాల్సి ఉంటుంది.

గాల్సై ; ఇది దొండపంట తొలి దశలో ఉన్నప్పుడే ఆశిస్తుంది. దీని నివారణ కోసం 5 శాతం వేప కషాయాన్ని తయారు చేసుకుని పంట తోలి దశలో ఉన్నప్పుడే పిచికారీ చేయాలి. దీని వలన ఈ పరుగు విచక్షణ శక్తిని కోల్పోతుంది. దాంతో పంటను ఆశించదు. గాల్భై ఆశించిన తీగలను గుర్తిస్తే వెంటనే వాటిని కత్తిరించాలి. ఆ తర్వాత ఎసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి, లేదా క్లోరోపైరిఫాస్‌ 2 మి.లీ. లీటరు నీటికి లేదా డైమిధోయేట్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలుపుని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దాన్ని పంటపై పిచికారీ చేసుకోవాలి. దాంతో ఆ పురుగులు మళ్లీ ఆశించవు. దీంతో గల్బై పురుగుల నివారణ సాధ్యం అవుతుంది.

వేరుకుళ్ళ తెగులు ; దొండ కాండాలను భూమిలో నాటినప్పుడు కొన్నిసార్లు దాని వేరుప్రాంతం మొత్తం కుళ్ళిపోతూ ఉంటుంది. అలాగే కుళ్ళిన ప్రాంతం మొత్తం పొలుసులుగా మారిపోతుంది. దీనికి కారణం వేరుకుళ్ల తెగులు. దీని నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ ద్రావణంతో శుద్ధి చేసిన కాండం ముక్కలను వాడితే ఈ తెగులు రాదు. అలాగే మొక్కల చుట్టూ లీటరు నీటికి 2 గ్రా. మెటలాక్సిల్‌ కలిపిన ద్రావణాన్ని నేలంతా తడిసేలా పోయాల్సి ఉంటుంది. ఇక తెగులు ఆశించిన మొక్క చుటూ దాదాపు ఒక మీటరు దూరంలో ఈ ద్రావణాన్సి పోయాలి.

బూజు తెగులు ; ఒక మాదిరి వర్షంతో కూడుకున్న చల్లిని వాతావరణంలో బూజు తెగులు వస్తుంది. మొదట్లో లేత ఆకు పచ్చ ముదురాకు పచ్చ కలిసి మెజాయిస్ వలే కన్పిస్తుంది. తర్వాత ఆకులపై భాగాన రంగు మచ్చలు, అడుగుభాగాన ఊదా రంగు మచ్చలు, బూజు వంటి పదార్ధం ఏర్పడుతుంది. ఆకులు పండు బారి ఎండిపోతాయి. దీని నివారణకు మాంకోజెబ్ 2.5గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పెంకు పురుగులు ; పిల్ల పురుగుల పెరుగుదల దశలో ఆకులను పూలను కొరికి తింటాయి. తీవ్ర దశలో ఆకులను పూలను పూర్తిగా తిని నష్టాన్ని కలిగిస్తాయి. దీని నివారణకు కార్బరిల్ 50శాతం పొడి 3గ్రాముల మందును లీటరు నీటికి కలిపి ఎకరాకు పదిట్యాంకులు పిచికారీ చేయాలి.

బూడిద తెగులు ; ఆకుల పై భాగన ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత తెల్లని పొడి వంటి పదార్ధం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. లేత ఆకుల కన్నా దాదాపు 20 రోజుల వయస్సున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు ట్రెడిమార్ఫ్ 1 ఎం.ఎల్ మందు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.