Kerala : వృద్ధుడి చొక్కా జేబులో పేలిన ఫోను.. ఆయుష్షు ఉండటంతో బ్రతికిపోయాడు…

తరచూ మొబైల్ ఫోన్లు పేలిన ఘటనలు వింటూ ఉంటాము. కేరళలో ఓ పెద్దాయన టీ తాగుతుండగా జేబులో ఉన్న సెల్ ఫోన్ పేలిపోయింది. అదృష్టవశాత్తు చిన్న గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

Kerala : వృద్ధుడి చొక్కా జేబులో పేలిన ఫోను.. ఆయుష్షు ఉండటంతో బ్రతికిపోయాడు…

Kerala

Exploded phone in old man’s pocket : ఓ పెద్దాయన టీ దుకాణంలో కూర్చుని టీ తాగుతున్నాడు. ఆయన చొక్కా జేబులో ఉన్న ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది. చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

Phone Blast : బాబోయ్.. ఛార్జింగ్‌లో ఉండగా పెద్ద శబ్దంతో పేలిపోయిన ఫోన్, ముగ్గురికి తీవ్ర గాయాలు

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో 76 ఏళ్ల ఇలియాస్ అనే వ్యక్తి మారొట్టిచల్ పరిసరాల్లోని టీ దుకాణంలో టీ తాగుతున్నాడు. అతని జేబులో ఉన్న ఫోన్ సడెన్‌గా పేలిపోయి మంటలు రావడం మొదలుపెట్టింది. అప్రమత్తమైన అతను వెంటనే ఫోన్ తీసి కింద పడేశాడు. దాంతో అతను ప్రమాదం నుంచి సేఫ్‌గా బయటపడ్డాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు ఇలియాస్‌ను పిలిచి వివరం అడిగారు. ఏడాది క్రితం కొన్న ఫోన్ అని ఇప్పటివరకూ ఎటువంటి ఇబ్బందులు లేవని ఇలియాస్ పోలీసులకు చెప్పాడు.

High Blood Pressure: వారానికి 30 నిమిషాలకు మించి సెల్ ఫోన్‌లో మాట్లాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి ..

తాజాగా కోజికోడ్‌లో కూడా ఇటువంటిదే సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ పేలడంతో ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. త్రిసూర్‍లో కూడా ఎనిమిదేళ్ల బాలిక చేతిలో ఉన్న మొబైల్ పేలి మరణించింది. వరుసగా ఫోన్ పేలుడు సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.