High Blood Pressure: వారానికి 30 నిమిషాలకు మించి సెల్ ఫోన్‌లో మాట్లాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి ..

మొబైల్ ఫోన్ లు తక్కువ స్థాయిలో రేడియే ఫ్రీక్వెన్సీ శక్తిని విడుదల చేస్తాయి. ఇది స్వల్ప కాలిక ఎక్స్‌పోజర్ తర్వాత రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని అధ్యయనం తెలిపింది.

High Blood Pressure: వారానికి 30 నిమిషాలకు మించి సెల్ ఫోన్‌లో మాట్లాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి ..

Moblie Phone

High Blood Pressure: సెల్‌ ఫోన్ మన జీవితంలో భాగంగా మారిపోయింది. సెల్ ఫోన్ లేనిదే మనం జీవించటం కష్టం అనే స్థాయికి చేరిపోయామనడంలో అతిశయోక్తి లేదు. కొంత మంది రోజుకు అవసరాలను బట్టి సెల్ ఫోన్ వాడుతుండగా.. మరికొందరు గంటల తరబడి.. మరికొంత మంది రోజులో సుమారు 15 నుంచి 20 గంటలు సెల్ ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తున్న పరిస్థితి. దీనివల్ల పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని చైనా పరిశోధకులు చెప్పారు. చైనాలోని గ్వాంగ్‌జౌలోని సదరన్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన అధ్యయన రచయిత ప్రొఫెసర్ జియాన్‌హుయ్ క్విన్ ఈ పరిశోధన ద్వారా.. సెల్ ఫోన్‌లో అదేపనిగా సాగించే సంభాషణల వల్ల అనారోగ్యపరంగా తీవ్ర ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. వారానికి 30 నిమిషాల కన్నా ఎక్కువ‌సేపు సెల్ ఫోన్లో మాట్లాడేవారికి అధికరక్తపోటు వచ్చే అవకాశం 12శాతం పెరగొచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

FM Radio Mobiles : అన్ని మొబైల్ ఫోన్లలో FM రేడియో తప్పనిసరిగా ఉండాల్సిందే.. ఫోన్ మేకర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం పదేళ్ల వయస్సు దాటిన వారిలో మూడొంతులు సెల్ ఫోన్ ఉంటుంది. ఈ సాధనాలు తక్కువ స్థాయిలో రేడియో ఫ్రీక్వెన్సీ శక్తిని వెదజల్లుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటికి ఎక్కువసేపు గురైతే రక్తపోటు పెరగొచ్చని చెప్పారు. గుండె పోటు, పక్షవాతానికి ఈ హైబీపీయే ప్రధాన కారణం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అనేకమందికి అకాల మరణం సంభవిస్తోంది. యూకే బయోబ్యాంక్ నుండి 37 నుంచి 73 సంవత్సరాల వయస్సు గల మొత్తం 2,12,046 మంది అధ్యయనంలో పాల్గొన్నారు. వీరంతా 12ఏళ్లుగా మొబైల్ వాడుతున్నారు. వారు సంవత్సర కాలంలో ఫోన్ వినియోగాన్ని, వారంలో ఎన్ని గంటలు మాట్లాడారు, హ్యాండ్స్ ఫ్రీ పరికరం లేదా స్పీకర్ ఫోన్ ని ఉపయోగించి మాట్లాడారా అనే సమాచారాన్ని సేకరించారు.

NoMoPhobia : మీ ఫోన్ కనిపించకపోతే ఇలానే టెన్షన్ పడుతున్నారా? మీకు ఈ ఫోబియా ఉన్నట్టే.. భారత్‌లో 75శాతం మందికి ఇదేనట..!

12ఏళ్ల తరువాత అధ్యయనంలో పాల్గొన్న వారిని పరిశీలించినప్పుడు 7శాతం మందిలో అధికరక్త పోటును గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువ సేపు ఫోన్ లో సంభాషించిన వారిలో 12శాతం (స్త్రీలు, పురుషులు సమానంగా ఉన్నారు), వారానికి 30 నుంచి 59 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడేవారికి 13శాతం, నాలుగు నుంచి ఆరు గంటలు ఫోన్‌లో మాట్లాడేవారికి 13శాతం, ఆరు గంటలకు పైగా ఫోన్ లో సంభాషించే వారికి 16 శాతం నుంచి 25శాతం అధిక రక్తపోటు ముప్పు పెరగొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Scorpion bites: ఎయిరిండియా విమానంలో షాకింగ్ ఘటన.. ప్రయాణికురాలిని తేలు కుట్టింది..!

మొబైల్ ఫోన్ లు తక్కువ స్థాయిలో రేడియే ఫ్రీక్వెన్సీ శక్తిని విడుదల చేస్తాయి. ఇది స్వల్ప కాలిక ఎక్స్‌పోజర్ తర్వాత రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని అధ్యయనం తెలిపింది. ప్రజలు సెల్ ఫోన్‌లో మాట్లాడే నిమిషాల సంఖ్య గుండె ఆరోగ్యానికి ముఖ్యమైనదని, ఎక్కువ నిమిషాలు మాట్లాడితే ఎక్కువ ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలిందని పరిశోధనలు తెలిపారు.